twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Degala Babji: ఈశ్వర.. పరమేశ్వర అంటూ డేగల బాబ్జీగా బండ్ల నట విశ్వరూపం

    |

    కమెడియన్ గా మారి అనేక సినిమాల్లో నటించిన బండ్ల గణేష్ ఆ తర్వాత నిర్మాతగా మారి స్టార్ నిర్మాతగా పేరు కూడా తెచ్చుకున్నారు. బాద్ షా, గబ్బర్ సింగ్ వంటి హిట్ సినిమాలతో ఆయన మంచి క్రేజ్ సంపాదించాడు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీర భక్తుడిగా చెప్పుకునే ఆయన హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. బండ్ల గణేష్ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగు ఈ మధ్యనే హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ చిత్రానికి వెంకట్ చంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. రిషి ఆగస్త్య సమర్పకుడిగా, స్వాతి చంద్ర నిర్మాతగా యష్ రిషి ఫిల్మ్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా పేరు 'డేగల బాబ్జీ'. ఈ సినిమా చిత్రీకరణ అప్పుడే పూర్తయిందట. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమాను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమా ట్రైల‌ర్‌ను విడుదల చేశారు.

    ఈ సినిమా ట్రైలర్ ని చూస్తే ఒక మర్డర్ కేసులో అనుమానితుడిగా బండ్ల గ‌ణేష్‌ పాత్రను పరిచయం చేశారు. సినిమాలో ఆయన పేరు డేగల బాబ్జీ ట్రైలర్ అంతా ఆయన ఒక్కరే ఉన్నారు. 'యాభై దెయ్యాలు సార్... అవి నన్ను బెదిరిస్తున్నాయి. భయపెడుతున్నాయి', 'కోపం... కోపం... భరించలేనంత కోపం', 'పుట్టగానే వాడు అసలు ఏడవలేదు. కానీ, వాడు పుట్టిన అప్పటన్నుంచి నేను ఏడుస్తున్నాను', 'పొట్టిగా ఉన్నా... మా అమ్మ అందంగా ఉంటుంది. అసలు మా అమ్మ అందంగా ఉండాలని రూల్ ఏమైనా ఉందా?' లాంటి డైలాగులు పేలుతూ ఉండగా ఆ డైలాగులు చెప్పేటప్పుడు నటుడిగా బండ్ల గణేష్ వేరియేషన్ చూపించారు. 'డేగల బాబ్జీ' టైటిల్ పోస్ట‌ర్‌ను బ్లాక్‌బ‌స్ట‌ర్‌ డైరెక్టర్ హరీష్ శంకర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

    Puri Jagannadh Launched Degala Babji Trailer

    కంటిపై కత్తిగాటు, దానికి వేసిన కుట్లు, గాయం నుండి కారుతున్న రక్తపు బొట్టుతో గణేష్ గెటప్ ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు ట్రైలర్ సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా దర్శక - నిర్మాతలు మాట్లాడుతూ "తెలుగు స్క్రీన్ మీద తొలిసారి సింగిల్ యాక్టర్ తో చేసిన సినిమా ఇదని, సినిమాలో మిగతా క్యారెక్టర్లు ఉన్నాయి కానీ వాళ్ల వాయిస్ వినిపిస్తుంది తప్ప మనుషులు కనిపించరని అన్నారు. హీరోగా డేగల బాబ్జీ పాత్రలో బండ్ల గణేష్ ఫెంటాస్టిక్ పెర్ఫార్మన్స్ చేశారు. ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారని, ఫస్ట్‌లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ట్రైల‌ర్‌కూ మంచి స్పందన లభిస్తోంది. త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తాం అని అన్నారు. ఇక ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ సినిమా ఆడియో విడుదల కానుంది.

    ఒత్తు సెరుప్పు సైజ్ 7 సినిమా తెలుగు రీమేక్‌ కోసం ఆర్ట్ డైరెక్టర్‌గా గాంధీ, సినిమాటోగ్రాఫర్‌గా అరుణ్ దేవినేని, మరుధూరి రాజా డైలాగ్స్, లైనస్ మాద్రి సంగీతం అందిస్తున్నారు. నాయుడు, ఫణి ఫీఆర్వోలుగా వ్యవహరిస్తున్నారు. నిర్మాతగా స్వాతి చంద్ర, దర్శకుడిగా వెంకట్ చంద్ర వ్యవహరిస్తున్నారు. ఇక హిందీ రిమేక్ చిత్రానికి సంబంధించిన షూటింగు చెన్నైలో ప్రారంభమైంది. అభిషేక్ బచ్చన్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

    English summary
    Puri Jagannadh Launched Degala Babji Trailer
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X