దున్నేద్దాం అంటూ చార్మీకి పూరి మెసేజ్.. అలాంటి ఆలోచనలు నాకు లేవంటూ ఛార్మి!

Recommended Video

Director Puri Jagannadh Birthday Wishes To Charmy Kaur || Filmibeat Telugu

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, చార్మింగ్ బ్యూటీ చాలాకాలంగా దగ్గరగా ఉంటున్నారు. సినిమాల్లో కనిపించడం మానేసిన ఛార్మి.. పూరి జగన్నాథ్ తో కలిసి ఆయన సినిమాల నిర్మాణాల్లో భాగమవుతూ ముందుకెళ్తోంది. పూరికి కూడా ఛార్మి తోడు బాగా కలిసొచ్చిందనే చెప్పుకోవచ్చు. అందుకే ఇద్దరూ కలిసి పలు సినిమాలు నిర్మిస్తూ దేశ విదేశాలు చుట్టి వస్తున్నారు. అయితే ఈ రోజు (మే 17) ఛార్మి పుట్టిన రోజు సందర్బంగా పూరి జగన్నాథ్ ఓ మెసేజ్ పెట్టారు. అదేవిధంగా ఛార్మి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది ఆ విశేషాలు చూద్దామా..

నిర్మాత గారు దున్నేద్దాం

ఛార్మి పుట్టిన రోజు సందర్బంగా ట్విట్టర్ వేదికగా పూరి జగన్నాథ్ ఓ మెసేజ్ పెట్టారు. ఇందులో చార్మీకి బర్త్ డే విషెస్ తెలుపుతూ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో దున్నేద్దాం అంటూ టాగ్ చేశారు. ఈ మేరకు స్పైసీ లుక్ లో చూస్తున్న ఛార్మి పిక్ కూడా షేర్ చేశారు. ఈ ఇద్దరిదీ క్రేజీ జోడీ కావడం కారణంగా ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ముందుగానే మొదలుపెట్టి ఎంజాయ్ చేశాం

ఇక తన బర్త్ డే విశేషాలను పంచుకున్న ఛార్మి.. ఈ ఏడాది బర్త్ డే సెలెబ్రేషన్స్ కొంచెం ముందుగానే మొదలుపెట్టామని చెప్పింది. ఇస్మార్ట్‌ శంకర్‌ సెట్లో ఇటీవలే హీరో రామ్ పుట్టిన రోజు ఎంజాయ్ చేశాం. ఇస్మార్ట్‌ శంకర్‌ టీజర్ కి వస్తున్న రెస్పాన్స్ సంతోషాన్నిస్తోంది, ప్రతీ రోజు ఓ పండగలా ఉందని ఛార్మి పేర్కొంది.

 ఆయన ఎదురు పడ్డప్పుడల్లా..

ఆయన ఎదురు పడ్డప్పుడల్లా..

ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంలో హీరో రామ్ తెలంగాణ యాసలో అదరగొట్టేస్తాడు. దీంతో ఆయన ఆయన ఎదురు పడ్డప్పుడల్లా నాక్కూడా తెలంగాణ యాసే వచ్చేస్తోంది అని ఛార్మి అంటోంది. మరోవైపు పూరి తనయుడు ఆకాష్ సినిమాను కూడా శరవేగంగా ఫినిష్ చేస్తున్నామని తెలిపింది ఛార్మి.

పెళ్లి విషయమై..

పెళ్లి విషయమై..

ఇక పెళ్లి విషయమై స్పందించిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం కెరీర్ పైనే తన దృష్టి ఉందని, అమ్మా నాన్నలకు దూరంగా జరిగి, ఇంకొకరి ఇంటికెళ్లి, అక్కడ వాళ్ల మధ్య ఉంటూ, వారికి జీవితాన్ని అంకితం చేయాలనే ఆలోచనలు తనకు లేవని అంటోంది. అంటే పెళ్లి చేసుకోనని చెబుతుందన్నమాట.

ఇస్మార్ట్‌ శంకర్‌

ఇస్మార్ట్‌ శంకర్‌

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటిస్తున్నారు. అందాల భామలు నిధి అగర్వాల్, నభా నటేష్ రామ్ తో చిందులేస్తున్నారు. పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పతాకాలపై ఛార్మి, పూరి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే గోవా షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ షూటింగ్ లో బిజీగా ఉంది. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేసింది. చిత్ర విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X