twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్లూ ఫిల్మ్ టీవీల్లో వచ్చినా పట్టించుకోవద్దు.. ఆలోచింపజేస్తున్న పూరి జగన్నాథ్ లక్డీకాపుల్‌ మంత్రం

    |

    నేటితరం జనరేషన్స్ కి జీవితం గురించి అర్థమయ్యేలా చెప్పాలి అంటే పూరి జగన్నాథ్ తరువాతే ఎవరైనా. పూరి మాటల్లో నిజం చాలా గట్టిగా ఉంటుంది అనేది అందరికి తెలిసిన విషయం. కమర్షియల్ కథలోనే బాధల గురించి కష్టాల గురించి చాలా ఈజీగా అర్థమయ్యేలా చెబుతుంటారు. అయితే ఇటీవల ఆయన చెప్పిన కొన్ని మాటలు వింటే జీవితంలో పరువు అనే ఆలోచనతో భయపడే వారికి ఒక క్లారిటీ వస్తుందనే చెప్పాలి.

    పోడ్‌కాస్ట్‌ ద్వారా..

    పోడ్‌కాస్ట్‌ ద్వారా..

    ప్రస్తుతం చాలా మంది ప్రముఖులు తమలోని భావాలను అందరికి చెప్పడానికి ఒక మీడియాను ఎంచుకుంటున్నారు.అదే పోడ్‌కాస్ట్‌ మీడియా. ఆడియో రూపంలో తమలోని భావాలను వ్యక్తపరిస్తూ జనాలను ఆకట్టుకుంటున్నారు. ఇక పూరి జగన్నాథ్ కూడా తనదైన శైలిలో జీవితం గురించి కొత్త సందేశాలు ఇస్తున్నారు.

    నలుగురు ఏం అనుకుంటారో..

    నలుగురు ఏం అనుకుంటారో..

    ఇక పూరి ఏం చెప్పారంటే.. ఇంట్లో వాళ్ళ ఏడుపేప్పుడు.. నలుగురు ఏం అనుకుంటారో, సొసైటీలో మన పరువు పోతుందో అని అనుకుంటూ ఉంటారు. సొసైటీ అంటే ఎవరు? మహాత్మ గాంధీ, రవీంద్ర నాథ్ ఠాగూర్, అంబేద్కర్ వంటి వాళ్ళతో నిండిపోయిందా? లేదు కదా!

    మనకంటే యదవలు..

    మనకంటే యదవలు..

    మన చుట్టూ వంద మంది ఉంటే అందులో మంచోళ్ళు 5 మంది కూడా ఉండరు. అంటే మిగతా 95 మంది వెస్ట్ అండ్ యూజ్ లేజ్. మనకంటే యదవలు ఈ సొసైటి నిండా ఇంత మంది ఉన్నప్పుడు వాళ్ళ కోసమా నువ్వు బాధ పడేది. ఇంట్లో ఎలాంటి అనర్థం జరిగినా కంగారు పడాల్సిన పని లేదు.

     పరువు గురించి ఫీల్ అవ్వద్దు.

    పరువు గురించి ఫీల్ అవ్వద్దు.

    మంచివాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకుంటారు. ఈ మిగతా యదవలు అర్థం చేసుకుంటే ఏంటి చేసుకోకపోతే ఏంటి?. లక్ డి కా పూల్. లైఫ్ అన్నాక ఏవేవో జరుగుతూ ఉంటాయి. అనర్థం జరగని ఇల్లు ఉండదు. మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేసుకోవాలా అని ఆలోచించాలి కాని పరువు గురించి ఫీల్ అవ్వద్దు.

    అయితే ఏంటి? చంపేస్తారా?

    అయితే ఏంటి? చంపేస్తారా?

    చాలా మంది పేరెంట్స్ కొడుకో కూతురో తప్పు చేస్తే ప్రాణాలు పోయినట్లు డ్యాన్స్ ఆడుతుంటారు. పిల్లలు పెళ్లి చేసుకోవడం లేట్ అయితే ఎదో కొంపలు మునిగిపోయినట్లు కుమిలిపోతుంటారు. పెళ్లి లేట్ అవ్వుద్ది.. లేదా అవ్వదు. అయితే ఏంటి? చంపేస్తారా?

    Recommended Video

    Mahesh Babu Comments On Movie With Puri Jagannath
    బ్లూ ఫిల్మ్ టీవీల్లో వచ్చినా

    బ్లూ ఫిల్మ్ టీవీల్లో వచ్చినా

    పొరపాటున మీ బ్లూ ఫిల్మ్ టీవీల్లో వచ్చినా పట్టించుకోవద్దు. రెండు రోజుల్లో అందరూ మర్చిపోతారు. కాకపోతే రెండో ప్రింట్ రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. అంతే తప్ప ఫస్ట్ రిలీజ్ గురించి మర్చిపోండి. ఈ సొసైటీకి పని పాట లేదు. మనకు ఏం జరిగినా ఒక్కటే మంత్రం. లక్డీకాపుల్‌ అంటూ పూరి జగన్నాథ్ తన మాటలతో ఎంతగానో ఆకట్టుకున్నాడు.

    English summary
    Many celebrities nowadays choose a medium to tell everyone their feelings. The same podcast media. Impress people by expressing their feelings in audio form. Puri Jagannath is also giving new messages about life in his own style.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X