మహేష్ బాబు వద్దన్న స్టోరీతోనే... ప్యాన్ ఇండియా లెవల్లో పూరి భారీ ప్లానింగ్, హీరో ఎవరంటే?

'ఇష్మార్ట్ శంకర్' మూవీ విజయంతో దర్శకుడు పూరి జగన్నాధ్ ఫుల్ జోష్ మీదున్నాడు. ఇకపై మాస్ సినిమాలే చేయాలని డిసైడైన ఈ డైరెక్టర్ తన వద్ద ఉన్న స్టోరీలకు పదును పెడుతున్నాడు. తాజా సమాచారం ప్రకారం సాండల్ వుడ్ రాకింగ్ స్టార్, కేజీఎఫ్ మూవీతో ఇండియా వైడ్ మంచి గుర్తింపు తెచ్చుకున్న యష్‌తో సినిమా చేసేందుకు పూరి జగన్నాధ్ సన్నాహాలు చేస్తున్నారట.

గతంలో పూరి జగన్నాధ్ 'జన గణ మన' పేరుతో సినిమా చేసేందుకు సన్నాహాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మహేష్ బాబు హీరోగా చేయాలనుకున్నాడు, 'బిజినెష్ మెన్'తర్వాత దీన్ని ప్రకటించారు కూడా. కారణాలు ఏమిటో తెలియదు కానీ ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది.

అందుకే ఆ మూవీ ఆగిపోయింది

అందుకే ఆ మూవీ ఆగిపోయింది

ఈ సినిమా ఎందుకు ఆగిపోయిందంటూ మహేష్ అభిమానులు కూడా పలు సందర్భాల్లో పూరిని అడిగారు. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న ఈ డాషింగ్ డైరెక్టర్ ఇటీవల ఈ విషయంలో ఓపెన్ అయ్యారు. మహేష్ బాబు హిట్లలో ఉన్న డైరెక్టర్‌తో మాత్రమే సినిమాలు తీస్తాడంటూ కాంట్రవర్సల్ కామెంట్స్ చేశారు.

మహేష్ వద్దన్న అదే కథతో

మహేష్ వద్దన్న అదే కథతో

మహేష్ బాబు ఏ సినిమా అయితే తనతో చేయను అన్నాడో... అదే సినిమాను కెజిఎఫ్ స్టార్ యష్‌తో చేయాలని పూరి జగన్నాధ్ డిసైడ్ అయ్యారట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళం, కన్నడలో ఈ మూవీ ప్లాన్ చేస్తున్నారట.

యష్ ఒప్పుకున్నారా?

యష్ ఒప్పుకున్నారా?

‘జన గణ మన' చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్‌లో చేయబోతున్నారట. ఈ సినిమా దేశంలో గత కొన్నేళ్లుగా జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, నేరాల ప్రస్తావనతో సాగుతుందని, ఇప్పటికే యష్‌ను బెంగులూరులో కలిసిన పూరి కథ చెప్పారని, త్వరలో మరోసారి వీరు కలిసి ఫైనల్ నేరేషన్ ఇస్తారని... ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ గురించి అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

దేశ భక్తికి సంబంధించిన సినిమా

దేశ భక్తికి సంబంధించిన సినిమా

సౌతిండియాకు చెందిన ఓ బడా ప్రొడ్యూసర్ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. దేశ భక్తికి సంబంధించిన సినిమా కావడంతో ఇండియా వైడ్ మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు. పూరి జగన్నాధ్ కన్నడ సినీ పరిశ్రమకు కొత్తేమీ కాదు. శివరాజ్ కుమార్‍తో యువరాజా, పునీత్ రాజ్ కుమార్‌తో హీరో, అప్పు చిత్రాలు చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X