దేవదాసుగా మారిన పూరి జగన్నాథ్.. చార్మీకి కనెక్షన్ ఏమిటంటే..
ఓ చేతిలో కుక్క.. మరో చేతిలో సిగరెట్‌తో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్‌గా మారింది.
ఓ చేతిలో కుక్క.. మరో చేతిలో సిగరెట్‌తో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్‌గా మారింది. సాధారణంగా నైతిక విలువలకు ప్రాధాన్యం ఇచ్చే పూరి సిగరెట్ తాగుతూ కనిపించడు. తన అలవాటును చాటుగానే ఉంచుతారు. అలాంటిది పూరి సిగరెట్ చేతిలో పట్టుకొని కుక్కను ప్రేమతో నిమురుతూ దేవదాసులా ఫోజిచ్చాడు. ఈ ఫొటో వెనుక ఓ ఆసక్తికరమైన వార్త ప్రచారంలో ఉంది.

మెహబూబా షూటింగ్‌లో
బాలకృష్ణతో పైసా వసూల్ తర్వాత ప్రస్తుతం తన కుమారుడు ఆకాష్‌తో మెహబూబా అనే చిత్రాన్ని సొంత బ్యానర్లో నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ హిమాచల్ ప్రదేశ్‌లోని మారుమూల ప్రదేశంలో జరుగుతున్నది.

షూటింగ్ గ్యాప్‌లో పూరీ
షూటింగ్ గ్యాప్‌లో సిగరెట్ తాగుతూ కుక్కతో ఆడుకుంటున్నాడు. అక్కడే ఉన్న ఫొటోగ్రాఫర్ ఆ సీన్‌ను తన కెమెరాలో బంధించాడు. ఆ ఫొటోను తన ఫేస్‌బుక్ అకౌంట్లో స్వయంగా పూరీ పోస్ట్ చేశారు కూడా.

పూరీ ఫోటోకు రెస్పాన్స్ ఫుల్
పూరీ షేర్ చేసిన తన ఫొటోకు భారీగా ప్రతిస్పందన వచ్చింది. చాలా మొత్తంలో షేర్లు కూడా జరిగాయి. అభిమానులు తమకు నచ్చిన విధంగా కామెంట్లు పాస్ చేశారు.

మెహబూబా లైన్ ప్రొడ్యూసర్‌గా
అక్కడి వరకు ఈ వ్యవహారంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ మెహబూబా చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్న సినీ నటి చార్మి ఈ ఫొటోను తన అకౌంట్‌లో పోస్ట్ చేసిందట. అయితే పూరీ ఇమేజ్‌ను దిగజార్చేలా ఉందనే కామెంట్లు రావడంతో ఆమె ఆ ఫోటోను వెంటనే తీసేసినట్టు సమాచారం.

ఆకాశ్‌ను హీరోగా
ప్రస్తుతం ఆకాశ్ హీరోగా రూపొందుతున్న మెహబూబా చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. ఆకాశ్ హీరోగా నటించిన తొలి చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫెయిల్యూర్ కావడం ప్రస్తుతం తన కుమారుడికి హిట్ ఇచ్చేందుకు పూరీ ప్రయత్నిస్తున్నాడు. ఎందరో హీరోలకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన పూరీ తన కుమారుడు పూరీకి కూడా మాంచి హిట్ ఇస్తాడని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications











