ఆ దృశ్యాలు చూసి చలించిపోయా.. పూరి జగన్నాథ్ ఎమోషనల్ ట్వీట్

విశాఖపట్నం ఘటన ప్రస్తుతం దేశం మొత్తాన్ని కుదిపేస్తోంది. బుధవారం అర్థరాత్రి ఎల్‌జీ పాలిమర్స్‌ నుంచి విష వాయువు లీకైన దుర్ఘటన అందరినీ ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. ఈ ఘటనపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు జాతీయ స్థాయిలో అందర్నీ షాక్‌కు గురి చేసింది. ఈ ఘటనలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. విశాఖ ఘటనపై టాలీవుడ్ మొత్తం స్పందించింది.

మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్,అల్లు అర్జున్, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, రామ్, నారా రోహిత్, కాజల్ అగర్వాల్, రాశీ ఖన్నా, రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మీ, మంచు మనోజ్, మంచు విష్ణు ఇలా ప్రతీ ఒక్కరూ స్పందించారు. ప్రాణాలను కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు.

Puri Jagannadh Reacts On Vizag Gas Leak

తాజాగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాద్ స్పందిస్తూ.. 'వైజాగ్ గ్యాస్ లీక్ ఘటనలో భాగంగా వస్తున్న వీడియోలన్నీ చూసి ఎంతో చలించిపోయాను. అంత మంది చావును చూసి నా హృదయం బద్దలవుతోంది. అక్కడి లోకల్ పీపుల్స్ వెంటనే స్పందించి సాయం చేయడానికి ముందుకు వచ్చినందుకు హ్యాట్సాఫ్. వెంటనే స్పందించి సాయం చేసిన వైఎస్ జగన్‌కు సెల్యూట్.. త్వరగా వైజాగ్ కోలుకోవాలని ఆశిస్తున్నా'నని ట్వీట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X