ఛార్మీ అంటే అందుకే ఇష్టం.. పూరీ జగన్నాథ్

By Rajababu

Recommended Video

Mehabooba Songs Release By Movie Team

సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రం మెహబూబా. పూరీ కనెక్ట్ బ్యానర్‌పై నటి ఛార్మితో సంయుక్తంగా పూరీ జగన్నాథ్ ఈ చిత్రాన్ని రూపొందించారు. మే 11 రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాడు. సినిమా రిలీజ్‌ను పురస్కరించుకొని పూరీ జగన్నాథ్ ఈ సినిమాకు సంబంధించిన మీడియా సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్బంగా దిల్ రాజు, ఛార్మీపై పూరీ ప్రశంసల వర్షం కురిపించారు.

 కెరీర్‌లోనే బెస్ట్ మెహబూబా

కెరీర్‌లోనే బెస్ట్ మెహబూబా

నిర్మాత దిల్ రాజుకు ఇటీవల మెహబూబా సినిమా చూపించాం. ఆయన సినిమా చూసిన తర్వాత.. నీవు మనసు పెట్టి తీస్తే సినిమా ఇలా ఉంటుంది. నీ కెరీర్‌లో బెస్ట్ సినిమా తీశావు అని నాకు దిల్ రాజు కౌగిలించుకొన్నారు అని పూరీ జగన్నాథ్ తెలిపారు.

దిల్ రాజు విడుదల చేస్తున్నారంటే

దిల్ రాజు విడుదల చేస్తున్నారంటే

మెహబూబా సినిమా దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారని చెప్పగానే నాకు చాలా ఫోన్లు వచ్చాయి. దిల్ రాజు రిలీజ్ చేస్తున్నాడంటే ఇక ఎలాంటి సమస్య ఉండదు అని చాలా మంది ఫోన్లు చేశారు. దాన్నిబట్టి తెలిసిందేమింటంటే ఇండస్ట్రీలో ఏ నిర్మాతకు లేని నమ్మకాన్ని దిల్ రాజు సంపాదించుకొన్నారు. హ్యాట్సాఫ్ దిల్ రాజు అని ఆయన అన్నారు.

సందీప్ చౌతా, భాస్కరభట్ల సూపర్బ్

సందీప్ చౌతా, భాస్కరభట్ల సూపర్బ్

మా సినిమాకు మ్యూజిక్ సందీప్ చౌతా అందించారు. సందీప్‌తో నాకు మూడో సినిమా. అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. మ్యూజిక్ తగినట్టే గేయ రచయిత భాస్కరభట్ల మంచి సాహిత్యాన్ని అందించారు. ఈ చిత్రానికి విష్ణు శర్మ సినిమాటోగ్రఫిని అందించారు. జునైద్ ఎడిటింగ్ సూపర్బ్ అని పూరీ అన్నారు.

ఛార్మీ కౌర్‌కు స్పెషల్ థ్యాంక్స్

ఛార్మీ కౌర్‌కు స్పెషల్ థ్యాంక్స్

మెహబూబా సినిమాకు సంబంధించి ఛార్మీకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ప్రొడక్షన్ వర్క్‌ను ఛార్మీ మామూలుగా చేయలేదు. సరిహద్దులో మైనస్ టెంపరేచర్‌లో షూటింగ్ చేశాం. వందల మంది మా సినిమాకు పనిచేశారు. వారందరికీ ఫుడ్, ఇతర వసతులను చాలా చక్కగా చేశారు. చార్మీ మగాళ్లకంటే ఎక్కువగా పనిచేస్తారు. అందుకే ఆమె అంటే చాలా ఇష్టం.

 నేహాశెట్టి బాగా చేసింది

నేహాశెట్టి బాగా చేసింది

ఆకాశ్‌కు జతగా నేహాశెట్టి నటించింది. సినిమా షూటింగ్‌కు ముందే వీరంతా సీన్లను రిహార్సల్ చేశారు. వీరికి ట్రైనింగ్ ఇచ్చిన ఉత్తేజ్‌కు థ్యాంక్స్. నేహాశెట్టి అద్భుతంగా నటించింది అని పూరి అన్నారు.

మరో పదేళ్లు గొప్ప సినిమాలు తీస్తా

మరో పదేళ్లు గొప్ప సినిమాలు తీస్తా

మెహబూబా సినిమా మే 11న రిలీజ్ అవుతున్నది. మీ అందరి దీవెనలు మాకు కావాలి. ముఖ్యంగా ఆకాశ్ గారికి మీ సపోర్ట్ కావాలి. ఇప్పుడు నాకు 50 ఏళ్లు.. మరో 10 ఏళ్లలో ఆకాశ్ కంటే గొప్ప సినిమాలు చేస్తానని ఛాలెంజ్ చేస్తున్నాను అని పూరి వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X