పూరి జగన్నాథ్ ఫేస్ బుక్ పోస్ట్ హాట్ టాపిక్
హైదరాబాద్: పూరి జగన్నాథ్ చేసిన ఓ ఫేస్ బుక్ పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఇండోనేషియాలోని బాలీ బీచ్ లో యోగా ప్రోగ్రాం అంటూ ఆయన ఓ ఫోటో పోస్టు చేసారు. అయితే దీనిపై కొందరు స్పందిస్తూ ఇది యోగా కాదు...‘ఇంద్రియా భోగా' అంటూ కొందరు విమర్శలకు దిగారు. వందలాది కామెంట్స్ వస్తున్నాయి.
YOGA PROGRAM... ACRO VINYASA IN BALI- INDONESIA
Posted by Puri Jagannadh on Thursday, November 19, 2015
ప్రస్తుతం పూరి దర్శకత్వంలో వహిస్తున్న ‘లోఫర్' సినిమా వివరాల్లోకి వెళితే..
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్‌తేజ్ హీరోగా రూపుదిద్దుకున్న చిత్రం 'లోఫర్'. ఇటీవల యూట్యూబ్‌లో విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌కు విశేష స్పందన లభిస్తోంది. సీకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తెరకెక్కించిన ఈ చిత్రంలో రేవతి, పోసాని కృష్ణమురళీ ప్రధాన పాత్రలు పోషించారు.

ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శర వేగంగా జరుగుతున్నాయి. ఫెమినా మిస్ ఇండియా 2013 రన్నరప్ దిషా పతాని ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కి జోడీగా నటిస్తోంది. ఇందులో వరుణ్ తేజ్ గతంలో కంటే డిపరెంటుగా చూపించబోతున్నాడు. బ్రహ్మానందం, రేవతి, పోసాని, ముఖేష్ రుషి, సంపూర్ణేష్‌బాబు, సప్తగిరి, పవిత్రలోకేష్, ఉత్తేజ్, భద్రమ్ తదితరులు నటించారు. సంగీతం: సునీల్ కశ్యప్. ఈ చిత్రంలో చరణ్ దీప్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మదర్ సెంటిమెంట్ కథాంశంగా రూపొందుతోంది.


Click it and Unblock the Notifications











