పూరి షార్ట్ ఫిల్మ్: ఆ న్యూడ్ ఫోజు వెనక అసలు కథ ఇదే (పెద్దలకు మాత్రమే)
దర్శకుడు పూరి జగన్నాధ్ తొలి సారిగా 'హగ్' పేరుతో ఒక షార్ట్ ఫిల్మ్ రూపొందించారు. కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన ఫస్ట్ లుక్ అందరిలోనూ ఆసక్తి రేకెత్తించింది. ఈ షార్ట్ ఫిల్మ్ మీద బాగా హైప్ రావడానికి కారణం ఆ ఫస్ట్‌లుక్‌లో ఓ అమ్మాయిని న్యూడ్‌గా చూపించడమే. ఈ షార్ట్ ఫిల్మ్‌లో పూరి ఎలాంటి సంచలన విషయాలు చూపించబోతున్నారో అంటూ ఎదురు చూశారు. ఈ షార్ట్ ఫిల్మ్ ఈరోజు (డిసెంబర్ 31) విడుదలైంది.

కాన్సెప్టు ఇదే, పెద్దలకు మాత్రమే
ఇందులో న్యూడ్ సన్నివేశాలు ఉండటంతో యూట్యూబ్ దీన్ని 18 సంవత్సరాలు నిండిన వ్యక్తులు మాత్రమే చూసే విధంగా ఏజ్ రిస్ట్రిక్టెడ్ వీడియోల జాబితాలో చేర్చింది. చెట్లను కాపాడుకుందాం, కొత్త చెట్లను నాటుదాం అనే మెయిన్ పాయింటుతో ఈ షార్ట్ ఫిల్మ్ రూపొందించారు. చెట్ల గురించిన ఈ సందేశాత్మక చిత్రంలో అమ్మాయిని న్యూడ్ గా నిలబెట్టాల్సిన అవసరం ఏమిటనేగా? మీ డౌట్. ఆ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

థాంక్స్ చెప్పాల్సింది వాటికే
మీరు శ్వాస తీసుకుంటున్నారా? స్వచ్ఛమైన గాలి పీలుస్తున్నారా? అయితే మీరు ముందు థాంక్స్ చెప్పాల్సింది చెట్లకే. చెట్లు కూడా మీలాగే అనేక అనుభూతులను పొందుతాయి. మాట్లాడుకుంటాయి, ప్రజలను గుర్తు పడతాయి అంటూ పూరి చెప్పుకొచ్చారు.

సమయం వృధా చేయడం కాదు
చెట్ల మధ్య సమయం గడపటం అంటే మీ సమయాన్ని వృధా చేయడం కాదు. మీరు చెట్లతో మెడిటేషన్ కూడా చేయొచ్చు. చెట్టును ‘హగ్' చేసుకోండి, మనకంటే వాటికి చాలా తక్కువ సమస్యలు ఉంటాయ... అని పూరి చెప్పే ప్రయత్నం చేశారు.

వైఫ్ సిగ్నల్స్ వస్తే అనేక చెట్లు నాటేవారేమో?
చెట్లు వైఫై సిగ్నల్స్ ఇచ్చేవి అయితే .... మీరు చాలా చెట్లు నాటేవారేమో? కానీ దురదృష్టం ఏమిటంటే అవి మనకు ప్రాణవాయువు మాత్రమే ఇస్తున్నాయని... పూరి తెలిపారు.
న్యూడ్‌గా కౌగిలించుకుంటే
న్యూడ్ గా చెట్టును హగ్ చేసుకుంటే ఫీలింగ్ చాలా గొప్పగా ఉంటుంది. కానీ ఒక పాత చెట్టును హగ్ చేసుకునే ముందు కొత్త మొక్కను నాటండి.... అంటూ పూరి తన షార్ట్ ఫిల్మ్ ద్వారా చెప్పే ప్రయ్నం చేశారు.


Click it and Unblock the Notifications











