పూరి జగన్ ‘లోఫర్' : లైవ్ లింక్ ఇక్కడ
హైదరాబాద్: వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లోఫర్' మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సి.కళ్యాణ్ నిర్మాత. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఫెమినా మిస్ ఇండియా 2013 రన్నరప్ దిషా పతాని ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కి జోడీగా నటిస్తోంది. ఈ చిత్రం ప్రమోషన్ ని కొత్తగా చేయాలని పూరి జగన్నాథ్ భావించారు. ఈ మేరకు ఆయన లొకేషన్ నుంచి షూటింగ్ లైవ్ ఇస్తున్నారు. ఆ లైవ్ ని చూడటం కోసం ఆయన తన Periscope ఛానెల్ లింక్ ని ట్వీట్ చేసారు. ఆ లింక్ లు ఇక్కడ చూడవచ్చు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఈ లింక్ ద్వారా అభిమానులు షూటింగ్ ని లైవ్ ని ఎంజాయ్ చేయవచ్చు. ప్రస్తుతం యాక్షన్ సీక్వెన్స్ గోవాలో చిత్రీకరిస్తున్నారు. విలన్ చరణ్ దీప్, సీనియర్ నటి రేవతి కూడా షూటింగ్ లో పాల్గొంటున్నారు.
గతంలో బాహుబలి గుమ్మిడికాయ సెర్మనీ ఫంక్షన్ ని కూడా ఇలాగే లైవ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ చిత్రానికి సునిల్ కశ్యప్ సంగీతం అందించబోతున్నారు.
బ్రహ్మానందం, రేవతి, పోసాని కృష్ణ మురళి తదితరులు ముఖ్య పాత్రలల్లో కనిపించనున్నారు. పూరి జగన్నాథ్ సినిమా అంటేనే అదిరిపోయేలా ఐటం సాంగ్ ఉంటుంది. తాజాగా ‘లోఫర్' చిత్రంలోనూ పూరి జగన్నాథ్ అంచనాలకు ఏ మాత్రం తగట్గకుండా ఐటం సాంగ్ ప్లాన్ చేస్తున్నారు. మోరాకన్ డాన్సర్ నోరా పతేహితో ఈ చిత్రంలో స్పెషల్ ఐటం సాంగ్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది.

నోరా పతేహి ఇప్పటికే టెంపర్, బాహుబలి, కిక్ 2 చిత్రాల్లో ఐటం సాంగ్స్ తో అదరగొట్టింది. తాజాగా ‘లోఫర్' చిత్రంలోనూ ఆమె సాంగ్ సినిమాకు హైలెట్ అయ్యేలా ఉంటుందని, మాస్ ఆడియన్స్‌ను మెప్పించే విధంగా ఉంటుందని అంటున్నారు. ఇటీవలే రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఇందుకు సంబంధించిన సాంగ్ చిత్రీకరించినట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో చరణ్ దీప్ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఆ మధ్య వచ్చిన కళ్యాణ్ రామ్ ‘పటాస్', రీసెంట్‌గా విడుదలైన విజయ్ ‘జిల్లా' చిత్రంలో ప్రతినాయకుడిగా అలరించిన చరణ్ దీప్ ప్రస్తుతం గబ్బర్ సింగ్ 2 చిత్రంలో కూడా నటిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మదర్ సెంటిమెంట్ కథాంశంగా రూపొందుతోందని టాక్.


Click it and Unblock the Notifications











