»   » బాలయ్య కంటే పూరీ ఎక్కువేనా.. డాన్ లుక్ అది కాదు.. ఫస్ట్ లుక్ డేట్ కన్ఫర్మ్

బాలయ్య కంటే పూరీ ఎక్కువేనా.. డాన్ లుక్ అది కాదు.. ఫస్ట్ లుక్ డేట్ కన్ఫర్మ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమా ఎంపిక విషయంలో బాలకృష్ణ పక్కా మాస్, మసాలా టేస్ట్. పక్కా ఫార్మూలా సినిమాలకే బాలయ్య ఓటు. అయితే.. దర్శకుడు పూరీ జగన్నాథ్‌ లేటేస్ట్ టేస్ట్. మేకింగ్, స్టైలింగ్ విషయంలో చాలా ఫాస్ట్‌గా ఉంటాడు. వీరిద్దరి కలయికలో సినిమా అంటే టాలీవుడ్‌లో రకరకాల మాటలు వినిపించాయి. బాలయ్యతో పూరీ సినిమా ముందుకెళ్తుందా అనే వారు కూడా ఉన్నారు. కానీ అందరి వాదనలకు చెక్ పెడుతూ పూరీ, బాలయ్య కాంబినేషన్ రాకెట్ స్పీడ్‌లో దూసుకెళ్తున్నది. తొలి షెడ్యూల్‌ను చాలా వేగంగా పూర్తి చేయడమే కాదు.. అదే సమయంలో ఎడిటింగ్ కూడా కంప్లీట్ చేసి బాలయ్యను సర్‌ప్రైజ్ చేశాడనేది ఫిలింనగర్ టాక్. ఇలా అనేక విషయాలతో ముందుకెళ్తున్న .

పూరీ, బాలయ్య మూవీ బడ్జెట్ రూ.35 కోట్లు

పూరీ, బాలయ్య మూవీ బడ్జెట్ రూ.35 కోట్లు

భవ్య క్రియేషన్ బ్యానర్‌పై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం బడ్జెట్ రూ.35 కోట్లు అట. అందులో బాలయ్య పారితోషికం రూ.10 కోట్లు. అంటే మిగిలిన రూ.25 కోట్లలోనే మిగితా వారి పారితోషికాలు, నిర్మాణ వ్యయం అంతా సర్దుబాటు చేసుకోవాల్సిందే. ఇక్కడే అసలు సమస్య వచ్చింది. ఈ రూ.25 కోట్లతో స్టార్ డైరెక్టర్ పూరీ రెమ్యునరేషన్ ఎంత అనేది అసలు ప్రశ్నగా మిగిలింది.

పూరీ రెమ్యునరేషన్ ఎంత..

పూరీ రెమ్యునరేషన్ ఎంత..

గత రెండేళ్లుగా చూస్తే దర్శకుడిగా పూరీ ట్రాక్ రికార్డు వెరీ పూర్. ఇలాంటి పరిస్థితుల్లోనే పూరీ రోగ్ చిత్రానికి రూ.17 కోట్లు తీసుకున్నాడనేది టాక్. ప్రస్తుతం ఉన్న రూ.25 కోట్లలోనే పూరీ రెమ్యునరేషన్ ఉంది కాబట్టి. రోగ్ సినిమాకు తీసుకొన్న పారితోషికం పూరీకి వస్తుందని అంచనా వేయలేం. ఆ పాతిక కోట్లలో ఎంత మొత్తంలో పూరీ సినిమా చేస్తాడు అనే విషయంపైనే పూరీ రెమ్యునరేషన్ ఆధారపడి ఉంటుందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయా? అయితే ఆ బడ్జెట్‌లోనే పూరీ రెమ్యునరేషన్ ఉంటుందా లేక సపరేట్‌గా పూరీకి పారితోషికం నిర్ణయించారా అనే విషయంపై ఎలాంటి సమాచారం లేదు.

బాలయ్య గెటప్ అది కాదు..

బాలయ్య గెటప్ అది కాదు..

ఇదిలా ఉండగా, గత రెండు రోజులుగా పూరీ సినిమాలో బాలయ్య గెటప్ లీక్ అయిందంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఇది బాలయ్య డాన్ లుక్ అంటూ విస్తృతంగా ప్రచారమవుతున్నది. తీరా చూస్తే బాలయ్య గెటప్ చాలా నాసిరకంగా ఉంది. చూసిన వాళ్లంతా ఇదేం గెటప్ అంటూ నొసలు చిట్లిస్తున్నారు. పూరీ రేంజ్ గెటప్ లేదే అన్నవాళ్లు ఉన్నారు.

రెండు షేడ్లలో బాలయ్య పాత్ర

రెండు షేడ్లలో బాలయ్య పాత్ర

పూరీ సినిమాలో బాలయ్య గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నాడనేది కన్‌ఫర్మ్. ఈ చిత్రంలో రజనీకాంత్ భాషా చిత్రంలో మాదిరిగా బాలయ్య పాత్రకు రెండు రకాల షేడ్స్ ఉంటాయి అనేది ఓ రూమర్. ఒక షేడ్ డాన్ అయితే.. మరోటి సాధారణ పౌరుడు. అయితే డాన్ పాత్రకు సంబంధించిన లీక్ ఫోటోకు, సినిమాలో కనిపించే పాత్రకు చాలా తేడా ఉంటుంది అని చిత్ర యూనిట్ సభ్యులు పేర్కొంటున్నారు.

10న ఫస్ట్‌లుక్..

10న ఫస్ట్‌లుక్..

ఈ చిత్రానికి సంబంధించి రకరకాల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. గ్యాంగస్టర్ అని, ఉస్తాద్ అని, తేడా సింగ్ అని ఏవోవో పేర్లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో శ్రీయా హీరోయిన్‌గా నటిస్తున్నది. బాలయ్యతో మరో కొత్త నటి ముస్కాన్ జతకట్టింది. అయితే చార్మీ కూడా ఐటమ్ సాంగ్‌లో మెరువనున్నట్టు లేటేస్ట్ న్యూస్. పోర్చుగల్‌లో షూటింగ్ ప్రాంతానికి చార్మీ ఇటీవల చేరుకోవడంతో ఆ వార్త నిజమోననే మాట వినిపిస్తున్నది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను జూన్ 10వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు సమాచారం.

English summary
Nandamuri Balakrishna’s look from Puri Jagannadh’s film is now doing rounds on the social media. Balakrishna’s bearded getup with heavy make up and wig has come out. The official first look will be released on 10th June on the eve of Balakrishna’s birthday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu