'రోగ్‌' పేరుతో మరో చంటిగాడిని తయారు చేస్తున్న పూరి... (ఫోటోస్)

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరిజగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న మరో చిత్రం 'రోగ్‌'.

By Bojja Kumar

హైదరాబాద్: బద్రి, ఇడియట్‌, పోకిరి, దేశముదురు, చిరుత, బుజ్జిగాడు, టెంపర్‌ వంటి డిఫరెంట్‌ క్యారెక్టర్‌ బేస్‌డ్‌ బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను రూపొందించిన డాషింగ్‌ డైరెక్టర్‌ పూరిజగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న మరో చిత్రం 'రోగ్‌'. 'మరో చంటిగాడు ప్రేమకథ' అనేది క్యాప్షన్‌.

జయాదిత్య సమర్పణలో తన్వి ఫిలింస్‌ బ్యానర్‌పై డా||సి.ఆర్‌.మనోహర్‌, సి.ఆర్‌.గోపి నిర్మాతలుగా రూపొందుతోన్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ వాలెంటెన్స్‌ డే సందర్భంగా విడుదలైంది.ఇషాన్ హీరోగా న‌టించిన ఈ సినిమా లావిషింగ్‌, స్టయిలిష్‌ విజువల్స్‌తో కూడిన ఈ ఫస్ట్‌ లుక్‌కు ఆడియెన్స్‌ నుండి ట్రెమెండస్‌ రెస్పాన్స్‌ రాబట్టుకుంది. మరో చంటిగాడి ప్రేమకథ అనే ట్యాగ్‌లైన్‌కు మంచి స్పందన వస్తుంది.

 ఇడియట్ లా ఉంటుందా?

ఇడియట్ లా ఉంటుందా?

గతంలో ‘ఇడియట్' అంటూ ఓ చంటిగాడి ప్రేమ కథను తెరకెక్కించిన పూరి జగన్నాథ్..... ఇపుడు ‘రోగ్' పేరుతో మరో చంటిగాడి ప్రేమను తెరక్కిస్తుండటం చర్చనీయాంశం అయింది. ఈ సినిమా కూడా ఇడియట్ తరహాలో ఉంటుందని భావిస్తున్నారు.

 అప్పట్లో పెద్ద హిట్

అప్పట్లో పెద్ద హిట్

పూరి జగన్నాథ్ కెరీర్లో చెప్పుకోదగ్గ పెద్ద హిట్లలో తప్పకుండా ఉండే చిత్రం ‘ఇడియట్'. రవితేజ హీరోగా దాదాపు పదిహేనేళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది.

 అంచనాలు భారీగానే

అంచనాలు భారీగానే

పూరి జగన్నాథ్ నుండి వచ్చే ప్రేమకథా చిత్రాలు ఆసక్తికరంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ తరం యువత పోకడలను, ఆలోచనలను తన సినిమాలో పర్ఫెక్ట్ గా చూపించడంలో పూరిది ప్రత్యేకమైన స్టైల్.

రోగ్

రోగ్

ఇషాన్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: బి.రవికుమార్‌, ఆర్ట్‌: జానీ షేక్‌, ఎడిటర్‌: జునైద్‌ సిద్ధిఖీ, మ్యూజిక్‌: సునీల్‌కశ్యప్‌, సినిమాటోగ్రఫీ: ముఖేష్‌.జి, నిర్మాతలు: సి.ఆర్‌.మనోహర్‌, సి.ఆర్‌.గోపి, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X