ఝాన్సీ, హేమ హెల్ప్ చేశారు.. అలా జరిగిపోయింది.. పూరి జగన్నాథ్

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం ఫుల్ ఖుషీలో ఉన్నారు. చాలా కాలం తర్వాత హిట్ టేస్ట్ చూసిన ఆయన పలు ఇంటర్వ్యూలు, ఈవెంట్లలో పాల్గొంటూ తెగ సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూరి జగన్నాథ్.. తన వ్యక్తిగత విషయాలు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా తన కెరీర్, పెళ్లి గురించిన సంగతులు ప్రేక్షకులతో పంచుకున్నారు.

తాను 'నిన్నే పెళ్లాడతా' సినిమాకు అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేస్తున్న సమయంలో పెళ్లి చేసుకున్నానని పేర్కొంటూ ఆ పెళ్ళికి సంబంధించిన పూర్తి వివారాలు చెప్పారు పూరి జగన్నాథ్. నిన్నే పెళ్లాడతా సినిమా చేస్తుండగానే తాను ప్రేమలో పడటం జరిగిందని, అయితే కొన్ని కారణాల వల్ల అప్పుడే పెళ్లి చేసుకోవాల్సి రావడంతో తనకు ఝాన్సీ, హేమ హెల్ప్ లాంటి వారు కొందరు సహాయ పడ్డారని పూరి చెప్పాడు. తాను పెళ్లి చేసుకున్న ఆ సమయంలో తన వద్ద ఒక్క రూపాయి కూడా లేదని అన్నాడు. ఎర్రగడ్డ లోని ఓ గుడిలో పెళ్లిచేసుకోగా ఝాన్సీ తాళిబొట్టు కొనిచ్చిందని, అలాగే హేమ బట్టలు కొనిచ్చిందని పేర్కొన్నాడు పూరి. అలా తన పెళ్లి కార్యక్రమాన్ని ఉదయం 11 లోపే ముగించేసి వెంటనే మళ్ళీ షూటింగ్ వెళ్లిపోయానని చెప్పుకొచ్చాడు పూరి జగన్నాథ్. ఇన్నాళ్లు జనానికి తెలియని ఈ ఆసక్తికర సంగతులు విని ఆశ్చర్యపోతున్నారు ప్రేక్షకులు.

Puri Jagannadh Says About His Marriage

ఇక పూరి తాజా సినిమా 'ఇస్మార్ట్ శంకర్' హవా కొనసాగుతూనే ఉంది. విడుదలైన వారం లోపే లాభాల్లో అడుగుపెట్టిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరిన్ని కలెక్షన్స్ రాబడుతోంది. సినిమాను పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ సంయుక్త సమర్పణలో పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి తెరకెక్కించారు. చిత్రంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించగా.. అందాల భామలు నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. పూరి మార్క్ మాస్ డోస్ ఆడియన్స్‌ని బాగా అట్రాక్ట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X