బాలయ్య దుర్మార్గుడిలా కనిపిస్తాడు.. మిగతా హీరోలు అలా కాదు.. పూరీ షాకింగ్ కామెంట్స్

Recommended Video

Puri Jagannadh Reveals Why Balayya Slaps His Own Fans || Filmibeat Telugu

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఎంతో మంది హీరోలతో పని చేశాడు. తెలుగులోనే కాకుండా హిందీలోనూ సినిమా తీశాడు. చాలా మందితో క్లోజ్‌గా ఉంటాడు. అయితే, వారందరిలో నందమూరి బాలకృష్ణ అంటేనే ఎక్కువ ఇష్టం అంటుంటాడాయన. ఇదే విషయాన్ని గతంలో చాలా సార్లు చెప్పిన పూరీ.. ఈ మధ్య 'ఇస్మార్ట్ శంకర్' ప్రమోషన్‌లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలలో కూడా స్పష్టం చేశాడు. అంతేకాదు, ఈ సందర్భంగా ఆయన.. బాలయ్యపై కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశాడు.

బాలయ్య అంటే ఇష్టం

బాలయ్య అంటే ఇష్టం

తనకు బాలయ్య అంటే ఇష్టమన్న పూరీ.. ‘‘ఇప్పటి వరకు చేసిన హీరోల్లో బాలకృష్ణ గారంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆయనకు క్యారెక్టర్ ఉంది. మనుషులకు విలువ ఇస్తాడు. మాట మీద నిలబడతాడు. అందుకే ఆయనతో సినిమా చేసే సమయంలో ఎంతో ఎంజాయ్ చేశాను. అప్పటి నుంచి మా మధ్య అదే బాండింగ్ కొనసాగుతోంది'' అని చెప్పుకొచ్చారు.

 ఫ్యాన్స్‌ను కొడతారనడంపై..

ఫ్యాన్స్‌ను కొడతారనడంపై..

నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్‌ను ఎందుకు కొడతారనే దానిపై స్పందిస్తూ ‘‘ఫ్యాన్స్ ఎవరేం చేస్తారో తెలియదు అందుకు బాలయ్య తనకు ఎదురుగా వచ్చినోడి మీద అనుమానం వస్తే.. ఫట్ మని కొడుతుంటాడు. మిగతా వాళ్లు కొట్టరు కాబట్టి బాలయ్య దుర్మార్గుడిలా కనిపిస్తాడు. ఇది ఎవరికీ తెలియదు మగాళ్లకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాచ్‌లు ఎత్తుకెళ్లిపోతారు. చేతిలో ఫోన్‌ ఉంటే లాక్కెల్లిపోతారు. చేతికున్నవి తెంపేస్తుంటారు. చైన్లు లాగేస్తుంటారు. ఇలాంటివి అన్నీ ఉంటాయి కాబట్టే బాలయ్య కొడుతుంటాడు'' అని పూరీ చెప్పాడు.

అలాంటి వాళ్లకు బాలయ్యే కరెక్ట్

అలాంటి వాళ్లకు బాలయ్యే కరెక్ట్

బాలయ్య కొట్టగానే మీడియాలో కథనాలు వచ్చేస్తుంటాయని, కానీ అక్కడ జరిగేది వేరని చెప్పిన ఈ డాషింగ్ డైరెక్టర్ ‘‘మీడియాలో అరే ఫ్యాన్‌ను కొట్టాడు అని చెబుతారు. ఫ్యాన్‌ను కొట్టాడు సరే.. అసలు అతడు హీరో దగ్గరకు ఎలా వెళ్లాడు.? నేనే మీ మీద పడితే మీకు భయం వేయదా..? మీకు నేను చెప్పేది అర్థం అవుతుందా..? ఇవన్నీ ఎవరూ ఆలోచించరు. ఇవన్నీ జరుగుతుంటాయి. ఎవరు పట్టుకుంటారో తెలియదు కానీ, హీరో బాల్స్ మాత్రం పట్టేసుకుంటారు. ఒక్కోసారి పబ్లిక్‌ను చూసి భయం అనిపిస్తుంటుంది. అలాంటి వాళ్లకు బాలయ్యే కరెక్ట్'' అంటూ వివరించాడు.

ఫ్యాన్స్‌లో శాడిస్టులు

ఫ్యాన్స్‌లో శాడిస్టులు

ఫ్యాన్స్‌లో కొందరు శాడిస్టులు ఉన్నారన్న పూరీ.. ‘‘హీరోలు బయటకెళ్లినప్పుడు ఎదురుగా ఎవరైన వస్తే వీళ్లేం చేస్తారోనని భయపడతారు. అంత శాడిస్ట్ నాకొడుకులు ఉన్నారు. వాచ్‌లు ఎత్తుకెళ్లిపోతారు. చేతిలో ఫోన్‌ ఉంటే లాక్కెల్లిపోతారు. చేతికున్నవి తెంపేస్తుంటారు. చైన్లు లాగేస్తుంటారు.. మొత్తంగా హీరోయిన్లలా పిసికేస్తుంటారు'' అని వెల్లడించాడు.

మరో సినిమా చేస్తా

మరో సినిమా చేస్తా

పూరీ జగన్నాథ్ - బాలకృష్ణ కాంబినేషన్‌లో ‘పైసా వసూల్' అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఇది అనుకున్న స్థాయిలో ఆడలేదు. దీంతో త్వరలోనే బాలయ్యతో మరోసారి సినిమా చేస్తానని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. దీంతో బాలయ్య ఫాన్స్ ఖుషీ అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X