ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అభిమానికి పూరి జగన్నాథ్ సర్‌ప్రైజ్‌.. చేతిలో సిగరెట్.. ఛార్మి ఏం చేసిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను అందుకున్న ఏకైక దర్శకుడు పూరి జగన్నాథ్. అతను ఎలాంటి సినిమా చేసినా కూడా హీరో పాత్రలతో డైలాగ్స్ తో ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఉంటాడు. దాదాపు పూరి ఏ హీరోతో వర్క్ చేసినా కూడా ఆ హీరో అభిమానులు అతనికి కూడా ఫ్యాన్స్ అయిపోతుంటారు. పూరి జగన్నాథ్ డైలాగ్స్ అంటే నేటి తరం యువతకు ఒక పిచ్చి అనే చెప్పాలి. ఎక్కడ కనిపించినా కూడా ఫోటోలు తీసుకోవడానికి ఎగబడుతుంటారు. రీసెంట్ గా ఒక ముంబై ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పూరి ఒక తెలుగు ఒక కుర్రాడిని కలిసిన విధానం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

అభిమానులతో ఫ్రెండ్లిగా..

అభిమానులతో ఫ్రెండ్లిగా..

పూరి జగన్నాథ్ సినిమాలో హీరోల పాత్రలను ఏ విధంగా ప్రయత్నం చేస్తాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జీవితంలో కష్టపడాలి మొండిగా వెళ్లాలి అనే విధంగా ప్రత్యేకంగా మంచి మెసేజ్ లు కూడా ఇస్తూ ఉంటాడు. జీవితం గురించి చెప్పడంలో పూరి జగన్నాథ్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇక అతన్ని కలుసుకోవడానికి అభిమానులు వస్తే వారితో ఎంతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉంటారు. వారి అనుభవాలను తెలుసుకుంటూ ఉంటారు.

ముంబైలో తెలుగు కుర్రాడు

ముంబైలో తెలుగు కుర్రాడు

అయితే ఇటీవల హఠాత్తుగా ముంబై ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర తెలుగు కుర్రాడు కనిపించడంతో పూరిజగన్నాథ్ చాలా సింపుల్ గా మాట్లాడాడు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ లైగర్ సినిమా కోసం ముంబై వెళ్లిన విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ గత కొన్ని రోజులుగా ముంబైలోనే జరుగుతోంది. ఇక షూటింగ్ లొకేషన్ దగ్గరకు హోటల్ నుంచి కారులో వెళ్తున్న పూరి జగన్నాథ్ కు అనుకోకుండా ఒక తెలుగు కుర్రాడు కనిపించాడు.

 కారు నెంబర్ చూసి..

కారు నెంబర్ చూసి..

కారు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉన్నప్పుడు ఆ కుర్రాడు వెనకాల బండి నెంబరు చూసి టిఎస్ అని ఉంది అంటే తప్పకుండా తెలుగు వారు అయి ఉంటారు అని అనుకున్నాడట. ఇక కారులోకి చూడడంతో పూరి జగన్నాథ్ కనిపించాడు. దీంతో వెంటనే అతన్ని కలుసుకునేందుకు ప్రయత్నం చేయగా పూరి జగన్నాథ్ కూడా కారు అద్దాలు తీసి అతనితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడాడు.

సెల్ఫీ తీసుకోవడానికి మొబైల్ లేదని..

టిఎస్ అని కారు నెంబర్ ఉండడంతో మన తెలుగు వాళ్ళు అయ్యి ఉంటారు అని అనుకున్నాను కానీ పూరి గారు కనిపించారు అంటూ ఆ కుర్రాడు ఎంతగానో ఆనంద పడ్డాడు. అంతేకాకుండా ప్రస్తుతం తన దగ్గర మొబైల్ లేదని లేకుంటే ఫోటో తీసుకునే వాడినని కూడా చాలా దీనంగా చెప్పాడు. ఇక అతని మాటలు మాట్లాడే విధానాన్ని చూసి పూరి జగన్నాథ్ కూడా ఎంతగానో సంతోషించాడు. పేరు ఏమిటి అని అడగగా అతను ప్రమోద్ అని చెప్పాడు.

Recommended Video

Liger - Boxing Legend Mike Tyson In Vijay Deverakonda's Liger
అతని కోసం పోస్ట్ చేసిన ఛార్మి

అతని కోసం పోస్ట్ చేసిన ఛార్మి

ఇంటర్ చదువుతున్నట్లు చెప్పిన ప్రమోద్ కు బాగా చదువుకోవాలని కూడా పూరి జగన్నాథ్ సలహా ఇచ్చాడు. సమ్మర్ లో టైగర్ సినిమా రాబోతుంది అని సినిమా చూడాలని కూడా చెప్పాడు. ఇక వారు మాట్లాడుకున్న విధానాన్ని చార్మి పక్కనే కూర్చుని వీడియో షూట్ చేస్తున్నట్లు క్లారిటీగా అర్థం అయింది. ఇక పూరి జగన్నాధ్ సిగరెట్ తాగుతూ కనిపించాడు. ఇక వీడియోను ఛార్మి తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసుకుంది. ఈ వీడియో పోస్ట్ చేసింది అతని కోసమే అంటూ ఎందుకంటే అతని దగ్గర మొబైల్ కూడా లేదని చెప్పినట్లు చార్మి ట్విట్టర్లో పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X