ఫ్రెండ్ షిప్‌కు వాల్యూ ఇచ్చే మనిషి, జై బాలయ్య.. మెహబూబా తీసిందే అందుకు.. పూరి!

Recommended Video

Mehbooba Movie Team Thanks Meet

మెహబూబా చిత్రం మే 11 న విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసారు. తన తనయుడు ఆకాష్ పూరిని హీరోగా పెట్టి మెహబూబా చిత్రాన్ని పూరి జగన్నాథ్ తెరకెక్కించారు. ఇండియా, పాక్ వార్ నేపథ్యంలో ప్రేమ కథగా ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ తెరకెక్కించడం విశేషం. డెబ్యూ హీరోయిన్ నేహా శెట్టి ఈ చిత్రంలో నటించింది. ఎమోషనల్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం డివైడ్ టాక్ తో నడుస్తోంది. ఈ సందర్భంగా చిత్రం గురించి పూరి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

అంతా మెచ్చుకుంటున్నారు

అంతా మెచ్చుకుంటున్నారు

ఈ చిత్ర ప్రీమియర్ షోని యూఎస్ ఆడియన్స్ తో కలసి చూశామని పూరి అన్నారు. యూఎస్ ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. సంగీతం, ప్రొడక్షన్ వాల్యూస్ ని అంతా మెచ్చుకుంటున్నారని పూరి జగన్నాథ్ అన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో కూడా

తెలుగు రాష్ట్రాల్లో కూడా

తెలుగు రాష్ట్రాల్లో కూడా మెహబూబా చిత్రానికి మంచి స్పందన వస్తోందని అన్నారు. సినిమాని నాలుగు సార్లు, ఐదుసార్లు చూసిన వారిని కూడా కలిశానని పూరి జగన్నాథ్ అన్నారు.

 సినిమా తీసిందే అందుకు

సినిమా తీసిందే అందుకు

ఈ చిత్రానికి మంచి రివ్యూలతో పాటు బ్యాడ్ రివ్యూలు కూడా వస్తున్నాయని పూరి తెలిపాడు. కానీ బ్యాడ్ రివ్యూలలో కూడా ఆకాష్ పూరి చాలా బాగా చేసాడని ప్రశంసిస్తున్నట్లు పూరి అన్నారు. తాను ఈ చిత్రాన్ని చేసిన ఉద్దేశమే అది అని పూరి తెలపడం విశేషం. తాను రెగ్యులర్ సినిమాలు చేస్తే పూరి అవే తీస్తున్నాడని అంటారు. ఇలాంటి సినిమాలు తీస్తే పూరి మార్క్ మిస్ అయిందని అంటున్నారని తెలిపాడు.

మనసు పెట్టి తీసిన చిత్రం

మనసు పెట్టి తీసిన చిత్రం

తాను మనసు పెట్టి తీసిన చిత్రం ఈ మెహబూబా అని పూరి తెలిపాడు. కేవలం ఆకాష్ పూరి మాత్రమే కాదు.. నేహా శెట్టి, ఇతర నటీనటులు అందరూ చాలా బాగా చేసారని పూరి తెలిపాడు.

జై బాలయ్య

జై బాలయ్య

ఈ చిత్రాన్ని ఆడియో వేడుక నిర్వహించలేదని, అందరికి థాంక్స్ చెప్పుకునే అవకాశం రాలేదని పూరి అన్నారు. ఈ సందర్భంగా పూరి బాలయ్యకు కృతజ్ఞతలు తెలియజేసారు. చిత్రం ప్రారంభం అయినప్పటి నుంచి సినిమా విశేషాల్ని ఫోన్ చేసి మరీ బాలకృష్ణ తెలుసుకున్నారని పూరి అన్నారు. ఫ్రెండ్ షిప్ కు వాల్యూ ఇచ్చే మనిషి బాలయ్య అని, జై బాలయ్య అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X