గురువు గారిని గుర్తు చేసుకున్న శిష్యులు.. పూరి, శ్రీను వైట్ల స్పందన!
దర్శకరత్న దాసరి నారాయణరావు 71వ జయంతి సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఈరోజు మే 4ను డైరెక్టర్స్ డేగా ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా హైదరాబాద్ ఫిలిం చాంబర్ లో ఈరోజు (మే 4) దాసరి నారాయణరావు విగ్రహన్ని ప్రతిష్టించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది.

దాసరి నారాయణరావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల, సి.కల్యాణ్, దర్శకులు కోడి రామకృష్ణ, ముత్యాల సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. దాసరి అరుణ్, అల్లు అరవింద్, వి.వి.వినాయక్ తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ దర్శకరత్న దాసరి నారాయణరావు గురించి మాట్లాడుతూ.. 151 సినిమాలకు దర్శకత్వం వహించడం మాటలు కాదు. గిన్నీస్ రికార్డ్స్‌లో దాసరి నారాయణరావు పేరు నమోదైంది. భవిష్యత్తులో కూడా ఏ దర్శకుడూ 151 సినిమాలు చెయ్యలేడనేది తన అభిప్రాయంగా తెలియజేసాడు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమకు భీష్మాచార్యుడు, తెలుగు దర్శకుల సంఘానికి ద్రోణాచార్యుడు , సినిమా ఇంటికి పెద్ద, దాసరి నారాయణ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు. దాసరి నారాయణ రావు గొప్ప హృదయం ఉన్న వ్యక్తి ఆయన సినిమా ఇండస్ట్రీలో ఎందరికో మార్గదర్శి అని దర్శకుడు శీనువైట్ల చెప్పడం జరిగింది. 'అందరం ఇక్కడే ఉన్నాం. కానీ ఆయనలేరు. దాసరి నారాయణ రావు గారు లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది అని దర్శకుడు పూరి జగన్నాథ్ ట్విట్టర్ లో తెలిపాడు.


Click it and Unblock the Notifications











