మెగాస్టార్ చిరంజీవి సినిమాలో స్టార్ డైరెక్టర్.. అనూహ్యంగా లీక్ చేసిన యంగ్ హీరో

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరున్న దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు చేసి ఫ్లాప్స్ అందుకున్నారు. అయితే చివరిగా రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో వచ్చి సూపర్ హిట్ అందుకున్న ఆయన ప్రస్తుతం విజయ్ దేవరకొండతో లైగర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన ఒక మరో పాన్ ఇండియా సినిమాను జనగణమన పేరుతో ప్రకటించారు. ఈ సినిమా ప్రకటించిన సమయంలోనే ఒక కీలక విషయం వెల్లడైంది. ఆ వివరాల్లోకి వెళితే..

ఇస్మార్ట్ హిట్

ఇస్మార్ట్ హిట్

2015లో టెంపర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న పూరి జగన్నాథ్ ఆ తర్వాత చాలా సినిమాలు చేసినా ఒక్క హిట్ కూడా అందుకో లేక పోయారు. అయితే ఇక ఎలా అయినా హిట్ కొట్టాలని భావించిన ఆయన తన ట్రేడ్ మార్క్ అయిన మాస్ మసాలా జానర్ లో చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. రామ్ సహా పూరి జగన్నాథ్ ఇద్దరికీ సినిమా మంచి బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి.

లైగర్ తో బిజీ

లైగర్ తో బిజీ

ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ తో పూరి జగన్నాథ్ ఏకంగా విజయ్ దేవరకొండను లైన్ లో పెట్టాడు. ఆయనతో బాక్సింగ్ నేపథ్యంలో లైగర్ సినిమా చేస్తున్నాడు. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను పూరి జగన్నాథ్, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక పూరి కనెక్ట్స్ బ్యానర్ ని పర్యవేక్షిస్తున్న ఛార్మి ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు తీసుకుని పూర్తి చేసింది. ఈ ఏడాది ఆగస్టు 25న ఈ సినిమా పూర్తి చేయనున్నారు.

జనగణమన అంటూ

జనగణమన అంటూ

దర్శకుడు పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండతో జనగణమన అనే ప్రాజెక్టును చేయబోతున్నట్లు ముందు నుంచి సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. తాజాగా ప్రాజెక్టును అఫీషియల్ గా లాంచ్ చేశారు. ఈ నిమాలో విజయ్ దేవరకొండ ఒక పవర్ఫుల్ ఇండియన్ సోల్జర్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ముంబైలో ఈ సినిమాను లాంచ్ చేసిన దర్శకుడు పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ తో ఒక అద్భుతమైన సన్నివేశాన్ని కూడా షూట్ చేశారు.

అందుకే చిరుతో సినిమా చేయలేదు

అందుకే చిరుతో సినిమా చేయలేదు

అయితే మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకు పూరి దర్శకత్వం వహిస్తారని అంతా అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ కాంబో మిస్​ అయింది. అయితే తాజాగా.. దీనిపై పూరి స్పందించారు. "మీరు చిరంజీవితో సినిమా చేయాలనుకున్నారు కదా. ఆ ప్రాజెక్ట్‌ ఏమైంది?" అని అడగగా.. "చిరంజీవికి కమర్షియల్‌ కథ చెప్పాను. ఆయనకు కథ నచ్చింది. కాకపోతే, ఆయన ప్రస్తుతం సమాజానికి ఉపయోగపడేలా మెసేజ్‌ ఓరియెంటెండ్‌ సినిమాలు చేయాలనుకుంటున్నారు. అందుకే నా ప్రాజెక్ట్‌ చేజారిపోయింది" అని అన్నారు.

Recommended Video

RRR Movie పై Alia Bhatt హర్ట్.. అలియా ని మించిన Olivia Morris క్రేజ్| Filmibeat Telugu
నో క్లారిటీ

నో క్లారిటీ

ప్రస్తుతం హీరో విజయ్​ దేవరకొండతో 'లైగర్'​ సినిమా చేస్తున్న పూరి.. తన తదుపరి చిత్రం 'జనగణమన'ను కూడా విజయ్​తోనే చేస్తున్నట్లు అయితే ఆ వెంటనే ఆ ప‌క్క‌న ఉన్న విజ‌య్ దేవ‌ర‌కొండ మైకు అందుకుని.. "పూరి గారు త్వ‌ర‌లో చిరు సార్‌తో క‌లిసి న‌టిస్తున్నారు. ఇప్పుడు వాళ్లిద్ద‌రూ యాక్టింగ్ కొలిగ్స్‌" అంటూ అసలు సీక్రెట్ బ‌య‌ట‌కు చెప్పేశాడు. అయితే ఏ సినిమాలో అనే విషయం మీద క్లారిటీ లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X