సార్..! "శివ" మన జీవితాలని మార్చింది: నాగార్జునకి పూరీ జగన్నాధ్ రిప్లై
శివతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి కొత్త అధ్యాయాన్ని ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ, మరోసారి నాగార్జునతో ఓ సినిమాని చేస్తున్నాడు. ఈ మూవీపై వర్మ ప్రియ శిష్యుడైన పూరీ జగన్నాధ్ తన ట్విట్టర్ పేజీలో స్పందించారు.
నాగార్జున, రామ్‌గోపాల్ వర్మ ఈ రెండు పేర్లకూ విడదీయరాని బంధం ఉంది. టాలీవుడ్ లో ఒక ట్రెండ్ సెట్టర్ లాంటి "శివ" అటు వర్మనీ, నాగార్జుననీ వాళ్ళతో పాటు తెలుగుసినిమా ఫార్మేట్ నీ మార్చి పడేసింది. ఆ సినిమా విడుదలై 28 ఏళ్లవుతున్నా ఇప్పటికీ కొత్త దర్శకులకు ఓ నిఘంటువులాంటిదని చెప్పాలి. అలాంటి క్రేజీ కాంబినేషన్ లో ఇప్పుడు మళ్ళీ దాదాపు ఇరవైఅయిదేళ్ళ తర్వాత మళ్ళీ ఇంకో సినిమా రాబోతోంది...
Recommended Video


లక్ష్మీస్ ఎన్టీఆర్
ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తాను రూపొందించబోయే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా కంటే ముందే నాగార్జునతో ఓ సినిమా చేస్తానని ప్రకటించిన వర్మ.. తాజాగా షూటింగ్ కూడా మొదలు పెట్టేసాడు. అప్పటి టీమ్ లో పూరీ జగన్నాధ్, తేజా లాంటి దర్శకులు ఉన్నారన్నది తెలిసిందే.

పూరీ ఒక పోస్ట్ పెట్టాడు
అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత అదే కాంబో లో వస్తున్న కొత్త ప్రాజెక్ట్ మీద అంతా ఆసక్తిగా ఉన్నారు. ఈ సినిమా విషయమై పూరీ ఒక పోస్ట్ పెట్టాడు... శివ చిత్రంతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి కొత్త అధ్యాయాన్ని ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ, మరోసారి నాగార్జునతో ఓ సినిమాని చేస్తున్నాడు.

నా లైఫ్‌ని ఛేంజ్ చేసింది
ఈ సినిమా తాజాగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్, స్టిల్స్‌కి మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ మూవీపై రామ్ గోపాల్ వర్మ ప్రియ శిష్యుడైన పూరీ జగన్నాధ్ తన ట్విట్టర్ పేజీలో స్పందించారు. 28 సంవత్సరాల క్రితం శివ సినిమా నా లైఫ్‌ని ఛేంజ్ చేసింది.

గౌరవం, ప్రేమ అలానే ఉన్నాయి
మళ్లీ ఇప్పుడు అదే కాంబినేషన్‌లో సినిమా చేస్తున్నా.. అంటూ నాగార్జున చేసిన ట్వీట్‌ని పోస్ట్ చేసి.. పూరీ ఇలా రియాక్ట్ అయ్యారు. "సార్.. శివ చిత్రం మా జీవితాలను మార్చేసింది. నాగార్జునగారు, వర్మగారు మరోసారి కలిసి సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వీరి కాంబినేషన్‌లో మరో బ్లాక్‌బ్లస్టర్ చిత్రం రాబోతుంది. మేమంతా ఇప్పటికీ అన్నపూర్ణ స్టూడియోని మా ఇంటిలా భావిస్తాం. ఆ గౌరవం, ప్రేమ అలానే ఉన్నాయి.. నమస్కారం'' అంటూ పూరి జగన్ పోస్ట్ చేశాడు.


Click it and Unblock the Notifications











