ప్రీమియర్ షో రెస్పాన్స్: మెహబూబా.. వార్, ఎమోషనల్ సీన్స్ హైలైట్!

Recommended Video

Mehabooba Movie Premiere Show Public Talk

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం మెహబూబా. పూరి తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన ఈ చిత్రం నేను ప్రేక్షకుల ముందు వస్తోంది. పూరి జగన్నాథ్ తనదైన శైలిలో ఈ చిత్రాన్ని ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కించారు. ఆకాష్ పూరి సరసన నేహా శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. 1971, 2018 ని కనెక్ట్ చేస్తూ పూరి ఈ చిత్రాన్ని రూపొందించారు. దేశభక్తి, ప్రేమ ప్రధానాంశాలుగా, బోర్డర్ లో జరిగే యుద్ధ సన్నివేశాలో మరో ఆకర్షణగా ఈ చిత్రం ఉంటుంది. యుఎస్ నుంచి వస్తున్న రిపోర్ట్స్, సోషల్ మీడియాలో టాక్ ప్రకారం ఈ చిత్రం ఎలా ఉందొ చూద్దాం..

సైనికుడిగా

సైనికుడిగా


ఈ చిత్రంలో ఆకాష్ పూరి సైనికుడిగా కనిపిస్తున్నాడు. 1971 ఇండియా, పాక్ వార్ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. ప్రస్తుతకాలం 2018 కి కూడా పూరి ఈ చిత్రాన్ని లింక్ చేసే తెరకెక్కించారు.

థ్రిల్ చేసే ట్విస్ట్

థ్రిల్ చేసే ట్విస్ట్

ఈ చిత్రంలో రెండు కాలాల మధ్య సాగె కథలో ఆసక్తికరమైన ట్విస్ట్ ఆడియన్స్ ని థ్రిల్ చేసే విధంగా ఉంటుంది. హీరో హీరోయిన్ల మధ్య సాగే ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులని మెప్పించే అవకాశం ఉంది.

కాస్త స్లో

కాస్త స్లో

స్క్రీన్ ప్లే స్లోగా సాగడం కొన్ని సన్నివేశాలు అనవసరంగా అనిపించేవిగా ఉండడం చిన్నపాటి మైనస్ లు. కానీ ఆకాష్ పూరి, నేహా శెట్టి మంచి నటన కనబరిచారు.

హైలైట్ అయిన అంశాలు

హైలైట్ అయిన అంశాలు

1971 ఇండియా, పాక్ వార్ ఎపిసోడ్, ఎమోషనల్ సన్నివేశాల తీవ్రత పెంచే బ్యాక్ గ్రౌండ్ సంగీతం, పూరి మార్క్ డైలాగులు ఈ చిత్రానికి ప్రధాన బలంగా చెప్పుకోవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X