పూరి తనయుడి రొమాంటిక్ సినిమా ఆగిపోలేదు.. ఫైనల్ గా ఓ క్లారిటీ ఇచ్చేశారు

డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న పూరి జగన్నాథ్ కొడుకును ఎలాగైనా ఒక సరైన ట్రాక్ లోకి తేవాలని ఫోకస్ పెడుతున్న విషయం తెలిసిందే. ఈ స్టార్ దర్శకుడు కెరీర్ లో దాదాపు తెలుగులో అందరి హీరోలతో వర్క్ చేసి హిట్ కొట్టాడు. అదే తరహాలో సొంత కొడుకుతో కూడా సక్సెస్ కొట్టాలని ప్లాన్ వేశారు. మొదట ఆకాష్ పూరిని మెహబూబా సినిమాతో గ్రాండ్ గా లాంచ్ చేయాలని అనుకున్నారు.

అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత రేంజ్ లో హిట్టవ్వలేదు. మొత్తానికి పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ తో ఫామ్ లోకి వచ్చేశారు. ఇక విజయ్ దేవరకొండతో లైగర్ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. అయితే బిజీగా ఉండడం వలన ఈ సారి కొడుకు సినిమాను తను డైరెక్ట్ చేయకుండా శిష్యుడు అనిల్ కు అప్పగించాడు. రొమాంటిక్ కథను సొంతంగా రాసుకున్న పూరి సినిమాను సొంత ప్రొడక్షన్ లో నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆల్ మోస్ట్ పూర్తయ్యింది.

Puri Jagannath son akash romantic movie announcement

అసలైతే సినిమాను ఇక రిలీజ్ చేసే అవకాశం లేదని కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి. ఇక రూమర్స్ కు చెక్ పెడుతూ చిత్ర యూనిట్ ఒక అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇచ్చింది. మార్చ్ 1న సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వబోతున్నట్లు పోస్టర్ ను కూడా విడుదల చేశారు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో కొత్ హీరోయిన్ కేతిక శర్మ నటిస్తోంది. మరి ఈ సినిమాతో ఆకాష్ ఏ స్థాయిలో హిట్ అందుకుంటాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X