విజయ్ దేవరకొండ లైగర్.. బడ్జెట్ విషయంలో మొదటిసారి హద్దులు దాటుతున్న పూరి జగన్నాథ్

టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాల జోరు మాములుగా లేదు. స్టార్ హీరోల హిందీ డబ్బింగ్ సినిమాలకు కూడా ఒక రేంజ్ లో రెస్పాన్స్ వస్తోంది. ఇక పాన్ ఇండియా సినిమా కూడా కరెక్ట్ గా తీయగలిగితే తప్పకుండా నేషనల్ వైడ్ మార్కెట్ ను సంపాధించుకోవచ్చని ఆలోచిస్తున్నారు. ఇక లైగర్ సినిమా కోసం పూరి జగన్నాథ్ బడ్జెట్ హద్దులు కూడా దాటేశారు.

Recommended Video

Vijay Devarakonda As Liger | బ్యాక్ గ్రౌండ్ లేకుండ ప్యాన్ ఇండియా రేంజ్ కి వచ్చానన్న విజయ్!!

Photos: Indian Celebs Amazing Transformation From Fat To Fit

మొదటిసారి బిగ్ మూవీ

మొదటిసారి బిగ్ మూవీ

పూరి జగన్నాథ్ తన 20ఏళ్ల సినిమా కెరీర్ లో దాదాపు టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హిరోలందరితో వర్క్ చేశాడు. ఆఖరికి బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ తో కూడా ఒక సినిమా చేశాడు. అయితే గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ దర్శకుడు పాన్ ఇండియా సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో లైగర్ అనే సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు.

అంచనాలకు తగ్గట్లుగానే

అంచనాలకు తగ్గట్లుగానే

సోమవారం పూరి జగన్నాథ్ లైగర్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే సినిమాకు సంబంధించిన బడ్జెట్ ఎంత అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విజయ్ కూడా ఇంతవరకు బడ్జెట్ విషయంలో లిమిట్స్ అయితే దాటలేదు. మొదటిసారి చేస్తున్న పాన్ ఇండియా సినిమా కాబట్టి అంచనాలకు తగ్గట్లుగానే సినిమాను రెడీ చేస్తున్నారు.

లిమిట్స్ దాటక తప్పలేదు

లిమిట్స్ దాటక తప్పలేదు

పూరి జగన్నాథ్ ఎంత పెద్ద స్టార్ హీరోతో సినిమా చేసినా కూడా ఇంతవరకు 60కోట్ల బడ్జెట్ ను పెద్దగా దాటింది లేదు. కథను బట్టి సినిమాకు ఎంత అవసరమో అంతే ఖర్చు చేస్తుంటారు. కానీ లైగర్ సినిమాకు లిమిట్స్ దాటక తప్పలేదు. మరోవైపు కరణ్ జోహార్ కూడా సినిమా ప్రొడక్షన్ లో బాగమవుతున్న విషయం తెలిసిందే.

మొత్తం బడ్జెట్ ఎంతంటే..

మొత్తం బడ్జెట్ ఎంతంటే..

ఇక లైగర్ సినిమా కోసం మొత్తం రూ.110కోట్ల వరకు ఖర్చు చేయనున్నారట. కేవలం ఇది ఒక అంచనా మాత్రమేనని తెలుస్తోంది. అవసరం అయితే మరికొంత. పెరిగే ఛాన్స్ ఉందట. కేవలం పూరి కెరీర్ లోనే కాకుండా విజయ్ కెరీర్ లో కూడా ఇదే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ. మరి లైగర్ నిజంగా పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అందుకుంటుందో లేదో చూడాలి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X