నాకు జీవితాన్ని ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్.. పూరి జగన్నాథ్ ఎమోషనల్ ట్వీట్, తేజు కంటిలో నీళ్లు!

పవన్ కళ్యాణ్ కోసం మెగా ఫ్యామిలీ మాత్రమే కాదు మిగిలిన సినీప్రముఖులు కూడా చేతులు కలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ అర్థ రాత్రి నుంచి చేస్తున్న ట్విట్స్ పెను సంచలనంగా మారుతున్నాయి. శ్రీరెడ్డి వివాదంలో పవన్ కళ్యాణ్ ని ఎలా ఇరికించాలని ప్రయత్నించారు, పవన్ తల్లిపై శ్రీరెడ్డి ఎలా అసభ్యంగా మాట్లాడింది, ఇందులో దాగిఉన్న కుట్ర ఏంటి వంటి అంశాలన్నీ ఒక్కొక్కటిగా అనుమానాలకు తావిస్తోంది. ఇదంతా చంద్రబాబు తనయుడు లోకేష్, టివి9 అధినేత రవిప్రకాష్, టివి9 ఓనర్ శ్రీనిరాజా, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కలసి నడిపిన కుట్రలో భాగం అని పవన్ కళ్యాణ్ ట్విట్ చేసారు. తాజాగా పవన్ కళ్యాణ్ ఫిల్మ్ ఛాంబర్ లో లాయర్లు అల్లు అర్జున్, నాగబాబు ఇతర సినీ ప్రముఖులతో సమావేశం అయ్యారు.

Recommended Video

ఫిలిం ఛాంబర్ లో పవన్ తో మెగా ఫ్యామిలీ తో భేటీ

పూరిజగన్నాథ్ ఎమోషనల్ ట్వీట్

పూరి జగన్నాథ్, రాంగోపాల్ వర్మ సన్నిహితంగా ఉంటారు. పవన్ కళ్యాణ్ ని శ్రీరెడ్డి చేత తిట్టించింది తానే అని ఆర్జీవీ ఒప్పుకున్న సంగతి తెలిసిందే. దీనితో పూరిజగన్నాథ్ ట్విట్టర్ లో ఎమోషనల్ ట్వీట్ పెట్టారు. తనకు పవన్ కళ్యాణ్ జీవితాన్ని ప్రసాదించిన వ్యక్తి అని పూరి ఎమోషనల్ గా తెలిపాడు. రాంగోపాల్ వర్మ చేసిన పని తనకు నచ్చలేదని అన్నారు.

నా కంట్లో నీళ్లు తిరుగుతున్నాయన్న తేజు

సాయిధరమ్ తేజ్ కూడా ఎమోషనల్ గా ట్వీట్ చేశాడు. పవన్ కళ్యాణ్ ట్వీట్స్ ని ప్రస్తావిస్తూ సాయిధరమ్ తేజ్ స్పందించాడు. కంట్లో నీళ్లు తిరుగుతున్నాయి. గొంతు వణుకుతోంది. కానీ మా నాయకుడిపై గుండెల నిండా నమ్మకం నిండి ఉందని తేజు ట్వీట్ చేసాడు.

భారీగా చేరుకుంటున్న అభిమానులు

భారీగా చేరుకుంటున్న అభిమానులు

ఫిల్మ్ ఛాంబర్ వద్దకు భారీగా పవన్ కళ్యాణ్ అభిమానులు, మెగా అభిమానులు చేరుకుంటున్నారు. ఫిలిం ఛాంబర్ వద్ద సీఎం, సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు వినిపిస్తున్నాయి.

 తరలి వస్తున్న సినీ ప్రముఖులు

తరలి వస్తున్న సినీ ప్రముఖులు

పవన్ కళ్యాణ్ కు మద్దతుగా సినీ ప్రముఖులు ఫిల్మ్ ఛాంబర్ కు చేరుకుంటున్నారు. శివాజీ రాజా, నటి హేమ, పరుచూరి వెంకటేశ్వరావు, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్ ఇతర ప్రముఖులు ఫిల్మ్ ఛాంబర్ కు చేరుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X