»   » బాలయ్య 101: పూరి జగన్నాథ్ కూతురు కూడా....

బాలయ్య 101: పూరి జగన్నాథ్ కూతురు కూడా....

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన పూరి జగన్నాథ్ ప్రస్తుతం బాలయ్య 101వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన అప్ డేట్ ఫిల్మ్ నగర్లో చర్చనీయాంశం అయింది.

ఈ సినిమా ద్వారా దర్శకుడు పూరి జగన్నాథ్ కూతురు పవిత్ర కూడా సినీ రంగంలోకి అడుగు పెట్టబోతోంది. అయితే ఆమె నటిగా రావడం లేదు కానీ.... డైరెక్షన్ డిపార్టు‍‌మెంటును తన కెరీర్ గా ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

అసిస్టెంట్ డైరెక్టర్‌గా

అసిస్టెంట్ డైరెక్టర్‌గా

సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలయ్య 101వ చిత్రానికి... ఆయన కూతురు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నట్లు సమాచారం.

పూరి ప్రోత్సాహం

పూరి ప్రోత్సాహం

సినిమా రంగంలోకి రావాలని పవిత్ర ఆశ పడటంతో ముందు అసిస్టెంట్ డైరెక్టర్‍‌గా చేరాలని, తద్వారా సినిమా రంగంలోకి వివిధ శాఖలపై మంచి గ్రిప్ వస్తుందని, ఆ తర్వాత నీకు ఏ డిపార్టుమెంటు ఇష్టమైతే దాన్ని కెరీర్ గా ఎంచుకోవాలని పూరి ప్రోత్సహించాడట. మరో వైపు పూరి కొడుకు ఆకాష్ హీరోగా రాణించేందుకు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

బాలయ్య 101

బాలయ్య 101

టైటిల్ ఇంకా ఖరారు కాని ‘బాలయ్య 101' సినిమా షూటింగ్ ప్రస్తుతం పోర్చుగల్‌లో జరుగుతోంది. జూన్ రెండో వారంలో అక్కడ షూటింగ్ పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగి రానుంది.

రిలీజ్ డేట్

రిలీజ్ డేట్

త్వరలో ఈ సినిమాకు టైటిల్ ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నారు. సెప్టెంబర్ 29న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

English summary
As per reliable sources, Puri's Daughter Pavithra will be doing a significant role in #Balayya101. Notably, Pavithra has been working as Assistant Director for Puri-Balakrishna's Movie. Puri encouraged both his children when they expressed their wish to be part of Film Industry in whatever way they can.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu