ప్రభాస్ సినిమా గుర్తుకువస్తోంది: 'లోఫర్' ... ట్రైలర్ (వీడియో)
హైదరాబాద్: పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్‌తేజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'లోఫర్'. ఇది వరుణ్ తేజ్‌కు మూడో చిత్రం. సీకే ఎంటర్‌టైమెంట్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేసారు. ఈ ట్రైలర్ చూసిన వారు పూరి స్టాండర్డ్ లో లేదని అంటున్నారు. గతంలో ప్రభాస్, పూరి కాంబినేషన్ లో వచ్చిన ఏక్ నిరంజన్ చిత్రం గుర్తు చేస్తోందంటున్నారు. ఆ ట్రైలర్ ని ఇక్కడ చూడండి.
సి.కల్యాణ్ మాట్లాడుతూ ''వరుణ్ తొలిసారి చేస్తున్న మాస్ సినిమా ఇది. యాక్షన్‌తో పాటు, సెంటిమెంట్‌కీ ప్రాధాన్యం ఉంది. కథానుసారమే టైటిల్ నిర్ణయించాం. చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే పాటల్ని విడుదల చేస్తాము''అన్నారు.

ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శర వేగంగా జరుగుతున్నాయి. ఫెమినా మిస్ ఇండియా 2013 రన్నరప్ దిషా పతాని ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కి జోడీగా నటిస్తోంది.
బ్రహ్మానందం, రేవతి, పోసాని, ముఖేష్ రుషి, సంపూర్ణేష్‌బాబు, సప్తగిరి, పవిత్రలోకేష్, ఉత్తేజ్, భద్రమ్ తదితరులు నటించారు. సంగీతం: సునీల్ కశ్యప్. ఈ చిత్రంలో చరణ్ దీప్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మదర్ సెంటిమెంట్ కథాంశంగా రూపొందుతోంది.


Click it and Unblock the Notifications











