గుసగుసలు... రేగాలనే పూరి అలా?
టాలీవుడ్ ప్రముఖ దర్శకడు పూరి జగన్నాథ్ డిఫరెంట్ అండ్ ఎనర్జిటిక్ డైరెక్షన్ తో తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే ఈ మధ్య మనోడికి అస్సలు కలిసి రావడం లేదు. బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ తో బుడ్డా సినిమా తీసి అందరి ప్రశంసలు అందుకున్నప్పటికీ కమర్సియల్ గా ఆ సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదనే వార్తలు కూడా ఉన్నాయి. ఇక తెలుగులో చూసుకుంటే పూరి చివరి సారిగా తీసిన 'నేను నా రాక్షసి' ప్లాపు. ఈ నేపథ్యంలో తన బ్రాండ్ ఇమేజ్ కు డ్యామేజీ కాకూడదనే ఉద్దేశ్యంతోనే సూపర్ స్టార్ మహేష్ బాబుతో బిజినెస్ మేన్ సినిమా ప్రారంభించాడు.
అయితే...బిజినెస్ మేన్ సినిమాకు సంబంధించి తనకంటే ఎక్కువ మహేష్ బాబుకే పేరొస్తోంది. అంతా మహేష్ అలా, ఇలా దుమ్ము రేపుతాడని చర్చించుకుంటున్నారే తప్ప తనను మాత్ర ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇలాంటి తరుణంలో తన గురించి అంతా చర్చించుకోవాలనే ఉద్దేశ్యంతో తనకు తానుగానే తనపై గుసగుసలు(గాసిప్ప్) రేగాలని ప్లాన్ చేశాడు పూరి. అందులో భాగంగానే ఇటీవల బిజినెస్ మేన్ ఆడియో ఫంక్షన్ లో మహేష్ బాబుతో సిల్లీ చిట్ చాట్ చేయంతో పాటు, అందులో నటిస్తున్న కాజల్ ను కొన్ని ప్రశ్నలు అడిగాడు.
''నీకు కలలోకి ఎప్పుడైనా మహేష్ బాబు వచ్చాడా...'' అని కాజల్ ను ఓ ప్రశ్న అడిగాడు పూరి. అందుకు సమాధానంగా కాజల్ స్పందిస్తూ...''మహేష్ రావడం లేదు కానీ..నువ్వొస్తున్నావ్'' అంటూ సమాధానం ఇచ్చింది కాజల్. అయితే పూరి కావాలనే ముందే ప్రిపేర్ అయిన కాజల్ తో అలాంటి సమాధానం చెప్పించాడని, ఈ సమాధానంతో తనకు-కాజల్ కు 'సం'బంధం ఉందని అంతా గుసగుసలాడుకుంటారనేది పూరి ఉద్దేశ్యమట. కానీ ఎవరూ దీన్ని పెద్ద పట్టించుకున్నట్లు మాత్రం కనిపించడం లేదు.


Click it and Unblock the Notifications











