»   » తప్పు దొర్లింది: ‘బాహుబలి-2’ థియేటర్లో సీన్ చూసి షాకైన ప్రేక్షకులు!

తప్పు దొర్లింది: ‘బాహుబలి-2’ థియేటర్లో సీన్ చూసి షాకైన ప్రేక్షకులు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగుళూరు: తప్పు ఎక్కడ జరిగిందో తెలియదు కానీ... బెంగుళూరులోని ఓ థియేటర్లో బాహుబలి-2 ప్రదర్శన సందర్భంగా జరిగిన సంఘటన ప్రేక్షకులను షాక్ కు గురి చేసింది. బెంగళూరులోని పీవీఆర్‌ ఎరేనా మాల్‌లో గురువారం రాత్రి వేసిన స్పెషల్ షో ప్రదర్శనలో పొరపాటు దొర్లడమే ఇందుకు కారణం.

సాధారణంగా ఎక్కడైనా మొదటి భాగం, తర్వాత రెండో భాగం ప్రదర్శిస్తారు. సినిమా మొదలవగానే యుద్ధం సీన్‌ రావడంతో ప్రేక్షకులు షాకయ్యారు. సినిమా అలాగే ఉందనుకుని అలా చూస్తూ ఉండి పోయిన ప్రేక్షకులు అప్పుడే క్లైమాక్స్ సీన్ రావడంతో అయోమయంలో పడ్డారు. ఎక్కడో తప్పు జరిగిందని భావించిన కొందరు ప్రేక్షకులు మేనేజర్ ను కలిసి గొడవ పెట్టారు.

మళ్లీ మొదటి నుండి

మళ్లీ మొదటి నుండి

ఏదో పొరపాటు వల్ల ముందుగా రెండవ భాగం ప్రదర్శితం అయిందని భావించిన యాజమాన్యం... సినిమాను మళ్లీ మొదటి నుండి ప్రదర్శించారు. దీంతో ప్రేక్షకులు శాంతించారు. ఎక్కువ డబ్బు ఖర్చయినా సరే అందరికంటే ముందు సినిమా చూద్దామని వచ్చిన తమకు ఎదురైన అనుభవంతో విస్తుపోయారు.

వింత అనుభవం

వింత అనుభవం

ఇలాంటి అనుభవం తమకు ఎప్పుడూ ఎదురు కాలేదని, టెక్నికల్ సమస్య వల్లే ఇలా జరిగిందని భావిస్తున్నామని ఈ సంఘటన గురించి పలువురు మీడయాకు వెల్లడించారు.

డేంజరస్ బుక్: రాజమౌళినే మార్చేసిందంటే...మామూలు విషయం కాదు!

డేంజరస్ బుక్: రాజమౌళినే మార్చేసిందంటే...మామూలు విషయం కాదు!

సమాజంలో దైవాన్ని నమ్మే వారు, దైవాన్ని నమ్మని వారు.... ఇలా రెండు రకాల మనుషులు ఉంటారు. ఇందులో ఒక వర్గానికి చెందిన రాజమౌళి... ఓ పుస్తకం కారణంగా పూర్తిగా మారిపోయారు. అందుకు సంబంధించిన వివరాల కోసం క్లిక్ చేయండి.

ఫ్యాన్స్ ఫైర్: బాహుబలి-2 సినిమాను కీరవాణి చెడగొట్టాడు!

ఫ్యాన్స్ ఫైర్: బాహుబలి-2 సినిమాను కీరవాణి చెడగొట్టాడు!

బాహుబలి-2కు సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ అందించిన కీరవాణిపై కొందరు రాజమౌళి అభిమానులు తీవ్రమైన విమర్శులు చేసారు. అందుకు సంబంధించిన వీడియో కోసం క్లిక్ చేయండి.

English summary
PVR Arena Mall in Bengaluru where they played the second half of the Baahubali 2 film FIRST! yes, that’s right. As per reports, the people in the theatre got to know when the movie moved to climax sequence. In fact, one of them even tweeted this – I was there in the show.. Thought “if u have this much great war sequence in First half how it is going to be in second..” So they got to know why Kattappa killed Baahubali much before they were to find out.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu