డేంజరస్ బుక్: రాజమౌళినే మార్చేసిందంటే...మామూలు విషయం కాదు!

By Bojja Kumar

హైదరాబాద్: సమాజంలో దైవాన్ని నమ్మే వారు, దైవాన్ని నమ్మని వారు.... ఇలా రెండు రకాల మనుషులు ఉంటారు. ఈ రెండు వర్గాల మధ్య చాలా విషయాల్లో అభిప్రాయ బేధాలుంటాయి. ఒకప్పుడు ఆస్తికుడుగా ఉండే రాజమౌళి ఓ పుస్తకం కారణంగా నాస్తికుడిగా మారిపోయాడట.

ఓ పుస్తకం కారణంగా రాజమౌళిలో ఇంత భారీ మార్పు వచ్చిందని తెలిసిన కొందరు ఆస్తికులు(దైవాన్ని నమ్మేవారు) అలాంటి పుస్తకాలకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇంతకీ ఆ పుస్తకం కథాకమామిషు ఏమిటి? రాజమౌళికి ఆ పుస్తకం ఇచ్చింది ఎవరు? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం.

ఒకప్పుడు రాజమౌళి ఆస్తికుడు

ఒకప్పుడు రాజమౌళి ఆస్తికుడు

రాజమౌళి ఒకప్పుడు ఆస్తికుడు. ఒకప్పుడు దేవుడుని నమ్మేవాడినని, పూజలు బాగా చేసేవాడినని రాజమౌళి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అయితే తర్వాత తాను ఒక పుస్తకం కారణంగా నాస్తికుడిగా మారానని తెలిపారు.

ఆయన వల్లే..

ఆయన వల్లే..

సినీ పరిశ్రమలోకి వచ్చిన తర్వాత నాస్తికుడైన గుణ్ణం గంగరాజుతో కలసి పని చేయడం, ఈ క్రమంలో ఆయన అయాన్ ర్యాండ్ రాసిన 'ఫౌంటైన్ హెడ్' పుస్తకాన్ని ఇచ్చారని, ఆ పుస్తకం చదివిన తర్వాత తన వ్యక్తిత్వం, ఆలోచనా విధానం పూర్తిగా మారిందని, నాస్తికుడిగా మారానని రాజమౌళి తెలిపారు.

డేంజరస్ బుక్ అంటున్న ఆస్తికులు

డేంజరస్ బుక్ అంటున్న ఆస్తికులు

రాజమౌళి ఈ విషయం చెప్పగానే.... దైవాన్ని నమ్మే ఆస్తికులు అప్రమత్తం అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పుస్తకం జోలికి వెళ్లకూడదని, ఆ పుస్తకం చదివితే నాస్తికులుగా మారే ప్రమాదం ఉందంటున్నారు.

‘బాహుబలి-2' ఆడియన్స్ టాక్: కొందరు నెగెటివ్‌గా...

‘బాహుబలి-2' ఆడియన్స్ టాక్: కొందరు నెగెటివ్‌గా...

అంతా ఊహించినట్లే వెండితెరపై మరో అద్భుతం ఆవిష్కరించాడు దర్శకుడు రాజమౌళి. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి పార్ట్ 2 ది కంక్లూజన్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే కొందరు మాత్రం ఈ సినిమాపై నెగెటివ్ గా స్పందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X