అది జీవితంలో మరిచిపోలేను..ఆ సినిమాల్లో నా పేరు వాడారు.. ఆర్ నారాయణమూర్తి కామెంట్స్

సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలో ఆర్ నారాయణమూర్తిని విచ్చలవిడిగా వాడేశారు. పెళ్లి చేసుకోకుండా సోలోగా ఉన్న వారిని ఆదర్శంగా తీసుకుంటున్న పాత్రలో సాయి ధరమ్ తేజ్ నటించాడు. మొన్నీమధ్యే విడుదల చేసిన ట్రైలర్‌లోనూ ఆర్ నారాయణమూర్తి చెప్పిన నగ్న సత్యాలను ట్రైలర్ చివర్లో పెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి.. పెళ్లి చేసుకోవాలి అంటూ ఆర్ నారాయణ మూర్తి చెప్పిన డైలాగ్‌తోనే ట్రైలర్ ముగుస్తుంది. ఇలా తన మాటలను, పేరును వాడుకోవడంపై ఆర్ నారాయణమూర్తి స్పందించాడు.

చాలా మంది చూపిస్తున్నారు..

చాలా మంది చూపిస్తున్నారు..

చాలా బాగుంది..గొప్పగా ఉంది.. దర్శక నిర్మాతలకు శిరసు వంచి నమస్కారాలు.. హీరో నా ఫ్యాన్ అంటూ చెప్పడం గొప్పగా ఉంది.. ప్రజల కోసం మంచి సినిమాలు చేస్తున్నాడు.. సాంస్కృతిక కళాకారుడి, సైనికుడిగా పని చేస్తున్నాడని చాలా మంది నన్ను చూపిస్తున్నారు.. చాలా సినిమాల్లో నన్ను చూపిస్తున్నారు అంటూ ఆర్ నారాయణ మూర్తి చెప్పుకొచ్చాడు.

అది మరిచిపోలేను..

అది మరిచిపోలేను..

ముఖ్యంగా పూరి జగన్నాధ్ తన దేశ ముదురు సినిమాలో హీరో పేరు వచ్చినప్పుడు చిరంజీవి, నిర్మాత పేరు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్,.. దర్శకుడి పేరు వచ్చినప్పుడు నా బొమ్మ వేశారు.. కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాను నాకు అంకితం చేశారు.. అది చిన్న విషయం కాదు.. ఓ ఎన్టీఆర్ లేదా ఓ గొప్పవారికో అలా చేస్తారు.. అది ఎప్పటికి మరిచిపోలేను.. అది జీవితంలో పెద్ద అచ్చీవ్‌మెంట్ అంటూ ఆర్ నారాయణ మూర్తి పేర్కొన్నాడు.

ఎంతో రుణపడి ఉన్నాను..

ఎంతో రుణపడి ఉన్నాను..

అలానే టెంపర్ సినిమాలో పోసాని గారు గొప్ప పాత్రను వేశారు.. నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ పాత్రను చేశారు.. ఆ పాత్రకు ఆయన నా పేరు పెట్టుకున్నారు.. అలాగే హైపర్ సినిమాలోనూ నిజాయితీ గల ప్రభుత్వాధికారి సత్యరాజ్ పాత్రకు నారాయణ మూర్తి అంటూ నా పేరు పెట్టారు.. ఇలా నా పేర్లు పెడుతున్న దర్శక నిర్మాతలకు ఎంతో రుణపడి ఉన్నాను. అంటూ ఆర్ నారాయణ మూర్తి తెలిపాడు.

చాలా గొప్ప విషయం..

చాలా గొప్ప విషయం..

పెళ్లి అనేది ఓ అమోఘమైన మూడు ముళ్ల బంధం.. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలన్న నానుడిని ఫాలో అవ్వాలి.. అలా చేసినప్పుడే జీవితం సంపూర్ణం అవుతుంది.. జీవితంలో ఓ ఆడది తోడుంటే ఎంతో సాధించగలరు.. పెళ్లి అనేది ఇతివృత్తంగా తీసుకుని నన్ను స్ఫూర్తిగా తీసుకుంటూ సినిమా తెరకెక్కించారంటే చాలా గొప్ప విషయం అంటూ ఆర్ నారాయణ మూర్తి ఎమోషనల్ అయ్యాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X