»   »  నిజం ఒప్పుకున్న రాజమౌళి: అనుష్క కీలకం కావడం వల్లే అలా...

నిజం ఒప్పుకున్న రాజమౌళి: అనుష్క కీలకం కావడం వల్లే అలా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ అనుష్క ఈ మధ్య ఎంత లావుగా మారిందో అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల విడుదలైన బాహుబలి-2 పోస్టర్లో అనుష్క చాలా సన్నగా, సూపర్బ్ లుక్ తో కనిపించింది. అంత లావుగా అనుష్క సినిమాలో ఇంత బాగా ఎలా కనిపించిందో అని అంతా ఆశ్చర్య పోయారు.

దీని వెనక ఉన్న అసలు రహస్యం చెప్పుకొచ్చారు రాజమౌళి. సైజ్ జీరో తర్వాతే అనుష్క లావుగా మారిందని, అంతకంటే ముందే చాలా వరకు అనుష్కకు సంబంధించిన పోర్షన్ పూర్తి చేసామని, సైజ్ జీరో తర్వాత మిగిలిన సీన్లు చిత్రీకరించే సమయంలో అనుష్క లావుగా ఉండటం వల్ల స్లిమ్ గా చూపించడానికి కొన్ని డిజిటల్ టచ్ అప్స్ ఇచ్చామని రాజమౌళి ఒప్పుకున్నారు.


 ఖర్చయినా వెనకాడలేదు

ఖర్చయినా వెనకాడలేదు

బాహుబలి 2లో అనుష్క ఆమె కీలకం కావడంతో కాస్త ఖర్చయినా వెనకాడకుండా డిజిటల్ టచ్ అప్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారట రాజమౌళి. అసలు కథ

అసలు కథ


ఇటీవల ఇంటర్వ్యూలో ఈ విషయాలన్నీ రాజమౌళి చెప్పుకొచ్చారు. బాహుబలి-2 తో సినిమా కథ పూర్తయినా... పాత్రలు పూర్తి కావని, బాహుబలి ది బిగినింగ్ లో పాత్రల పరిచయం అయిందని, బాహుబలి ది కంక్లూజన్ లో అసలు కథ మొదలవుతుందన్నారు. కంటిన్యూ అవుతాయి

కంటిన్యూ అవుతాయి


ఈ సినిమాలోని పాత్రలు కంటిన్యూ అవుతాయని, అవి నవల రూపంలో గానీ, కామిక్స్ రూపంలోగానీ, సీరియల్ రూపంలో గానీ ఉండొచ్చని రాజమౌళి తెలిపారు. బాహుబలి తర్వాత ఏ ప్రాజెక్టు అనేది ఇంకా డిసైడ్ కాలేదని, మహాభారతం మాత్రం పదేళ్ల తర్వాతే ఉంటుందని తెలిపారు రాజమౌళి. నాన్న కోసం... అనుష్కను లైన్లో పెడుతున్న రామ్ చరణ్!

నాన్న కోసం... అనుష్కను లైన్లో పెడుతున్న రామ్ చరణ్!


2017లో మెగాస్టార్ రెండు సినిమాలు చేసేందుకు ప్రణాళికలు వేసుకున్నారు. 151వ సినిమాను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని కూడా స్వయంగా రామ్ చరణే నిర్మించబోతున్నారు. ఇక 152వ చిత్రం బోయపాటి దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించబోతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
 హీరోయిన్ అనుష్క సినీఫీల్డ్‌కి రాకముందు (ఫోటోస్)

హీరోయిన్ అనుష్క సినీఫీల్డ్‌కి రాకముందు (ఫోటోస్)


హీరోయిన్ అనుష్క సినిమాల్లోకి రాకముందు యోగా టీచర్‌గా పని చేసిన సంగతి తెలిసిందే. అంతకు ముందు ఆమె బెంగుళూరులోని ఈస్ట్‌వుడ్ పాఠశాలలో కూడా పని చేసారు. అందుకు సంబంధించిన వివరాలు, ఫోటోల కోసం క్లిక్ చేయండి.
English summary
"Baahubali 2 Maximum portions of Anushka were shot even before she began preparation for 'Size Zero'. Anushka wasn't able to retain the same physique by the time she was required to shoot few scenes of 'Baahubali 2'. So, We preferred Digital Touch-Up for few shots and that's not a big deal at all." Rajamouli said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu