»   » నాన్న కోసం... అనుష్కను లైన్లో పెడుతున్న రామ్ చరణ్!

నాన్న కోసం... అనుష్కను లైన్లో పెడుతున్న రామ్ చరణ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అభిమానులు కోరుకున్నట్లే మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రంతో ప్రేక్షకలు ముందుకొచ్చారు. అభిమానులు కూడా అన్నయ్యకు గ్రాండ్ వెలకం ఇచ్చారు. 'ఖైదీ నెం 150' చిత్రాన్ని సెన్సేషన్ హిట్ చేసారు. ఫ్యాన్స్ ఇచ్చిన ఎంకరేజ్మెంటుతో వరుస సినిమాలతో బాక్సాఫీసును కుమ్మేందుకు రెడీ అవుతున్నాడు బాస్.

2017లో మెగాస్టార్ రెండు సినిమాలు చేసేందుకు ప్రణాళికలు వేసుకున్నారు. 151వ సినిమాను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని కూడా స్వయంగా రామ్ చరణే నిర్మించబోతున్నారు. ఇక 152వ చిత్రం బోయపాటి దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించబోతున్నారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మెగా 151వ సినిమాలో అనుష్కను హీరోయిన్ గా తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారట. వాస్తవానికి 150వ సినిమాలోనే అనుష్క నటించాల్సి ఉంది. అయితే అప్పుడు అనుష్క బాహుబలి ప్రాజెక్టులో బిజీగా ఉండటంతో డేట్స్ అడ్జెస్ట్ కాలేదు.

 ఈసారి అనుష్క మిస్సయ్యే అవకాశం లేదు

ఈసారి అనుష్క మిస్సయ్యే అవకాశం లేదు

మెగాస్టార్ పర్సనాలిటీకి పర్ఫెక్టుగా సూటయ్యే స్టార్ హీరోయిన్లు ఇండస్ట్రీలో చాలా కొద్ది మందే ఉన్నారు. వారిలో అనుష్క అందరికంటే ముందు ఉంది. 151వ సినిమాకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుష్కనే తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు రామ్ చరణ్.

 సంప్రదింపులు

సంప్రదింపులు

ఇప్పటి నుండే అనుష్క డేట్స్ దక్కించుకోవడానికి కొణిదెల ప్రొడక్షన్స్ టీం ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. ఎలాగూ బాహుబలి 2 ప్రాజెక్ట్ షూటింగ్ పూర్తయింది కాబట్టి అనుష్క మెగా 151వ మూవీలో నటించడం ఖాయంగా కనిపిస్తోంది.

 సినిమా ఎప్పుడు మొదలు?

సినిమా ఎప్పుడు మొదలు?

మెగాస్టార్ నటించబోయే 151వ చిత్రం ఏప్రిల్‌ నెలలో మొదలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టినట్లు సమాచారం. అయితే ఈ సినిమా నేపథ్యం, కథ ఎలా ఉంటుందనేది ఇంకా బయటకు రాలేదు.

ఖైదీ నెం 150... సెకండ్ వీక్ షేర్ ఎంతో తెలుసా?

ఖైదీ నెం 150... సెకండ్ వీక్ షేర్ ఎంతో తెలుసా?మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెం 150 చిత్రం ఊహకందని కలెక్షన్లతో దూసుకెలుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్లో ఫాస్టెస్ట్ 100 కోట్ల గ్రాస్ సాధించిన చిత్రంగా రికార్డుల కెక్కిన ఈచిత్రం రెండు వారాల్లో సాధించిన షేర్ ట్రేడ్ పండితులను ఆశ్చర్య పరుస్తోంది.

English summary
Megastar Chiranjeevi's 151 movie shooting going to start in April. The movie will be directed by Surendar reddy and produceed by Ram Charan. Film nagar source said thart Anushka confirmed as a female lead.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu