ఛార్మినే డీల్ చేసింది.. పూరి జగన్నాథ్‌తో అంటే.. హీరో రామ్ సెన్సేషన్

Recommended Video

Ram Pothineni Praises Charmi Kaur At Ismart Shankar Event || Filmibeat Telugu

రామ్ పోతినేని హీరోగా పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది 'ఇస్మార్ట్ శంకర్' మూవీ. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్‌పై ఛార్మి, పూరిజగన్నాథ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిత్రంలో అందాల భామలు నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మాస్ ఆడియన్స్‌కి స్పెషల్ ట్రీట్ ఇచ్చేలా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. జులై 18 వ తేదీన 'ఇస్మార్ట్ శంకర్' ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ఇస్మార్ట్ శంకర్ బోనాలు

ఇస్మార్ట్ శంకర్ బోనాలు

సినిమా షూటింగ్ చేస్తూనే ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేసిన ఇస్మార్ట్ శంకర్ టీమ్ వరంగల్ లో 'ఇస్మార్ట్ శంకర్ బోనాలు' పేరిట ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి చిత్రయూనిట్ సహా హీరో హీరోయిన్లు రామ్, నిధి అగర్వాల్, నభా నటేష్ హాజరై సందడి చేశారు. ఈ ముగ్గురితో ఛార్మి వేసిన చిందులు వరంగల్ ప్రజల్లో జోష్ నింపాయి.

ఫుల్ ఎనర్జీతో రామ్ స్పీచ్.. ఆడియన్స్ ఈలలు

ఫుల్ ఎనర్జీతో రామ్ స్పీచ్.. ఆడియన్స్ ఈలలు

ఇస్మార్ట్ శంకర్ సినిమా ద్వారా తొలిసారి పూర్తిస్థాయి మాస్ హీరోగా డిఫరెంట్ లుక్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు హీరో రామ్. డబుల్ దిమాక్ అనే ట్యాగ్ లైన్ తో రూపొందిన ఈ సినిమాలో రామ్ ఎనర్జీ ఎలా ఉంటుందో టీజర్ ద్వారా అర్థమైపోయింది. అయితే వరంగల్ బోనాలు ఈవెంట్ లో కూడా అంతకుమించిన ఎనర్జీతో వేదికపై మాట్లాడి ఆడియన్స్ చేత ఈలలు వేయించాడు రామ్.

దీనమ్మా ఆ కిక్కే వేరు

దీనమ్మా ఆ కిక్కే వేరు

తెలంగాణ యాసతో రామ్ మాట్లాడిన తీరు ఈవెంట్ లో హైలైట్‌గా నిలిచింది. ఈ సందర్బంగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి మాట్లాడిన ఆయన ఒక్క ముక్కలో ఆయనతో పని చేస్తే ' దీనమ్మా ఆ కిక్కే వేరు' అని ఊర మాస్ డైలాగ్‌తో చెప్పేశాడు. వరంగల్ నగరంలో ఇలా బోనాలు నిర్వహించుకోవడం, మీ అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉందని రామ్ అన్నాడు.

అందరినీ ఛార్మినే చూసుకుంది

అందరినీ ఛార్మినే చూసుకుంది

షూటింగ్ సమయంలో ఇస్మార్ట్ శంకర్ యూనిట్‌తో కలిసి ఎంజాయ్ చేస్తూ ఫినిష్ చేశానని రామ్ పేర్కొన్నాడు. చిత్ర యూనిట్ అందరినీ మేనేజ్ చేయడం, షూటింగ్ వ్యవహారాలు పర్యవేక్షించడం లాంటి పనుల్లో ఛార్మి ముందుండి నడిపించిందని ఆయన అన్నారు. అన్ని సినిమాలకన్నా ఈ సినిమాకు కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వచ్చిందని రామ్ పేర్కొన్నాడు. అందరినీ ఛార్మినే చూసుకుందని, ఆమె వల్లనే తమకు కష్టమనేది తెలియకుండా హాయిగా షూటింగ్ చేశామని అన్నాడు రామ్.

బోనాలు సాంగ్ రిలీజ్

బోనాలు సాంగ్ రిలీజ్

వరంగల్ లో జరిగిన ఈ ఈవెంట్‌లో బోనాలు సాంగ్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ నేపథ్యంలో ఇస్మార్ట్ శంకర్ పాటలపై స్పందించిన రామ్.. ముందుగా మణిశర్మ గారికి థ్యాంక్స్ చెప్పాలి. సినిమాలో ఏ పాట బాగుందని ఫిక్స్ కాలేకపోతున్నానని అని రామ్ అన్నాడు. రామ్ ఎనర్జిటిక్ మాటలతో వరంగల్ స్టేజ్ దద్దరిల్లిపోయింది.

 ఇస్మార్ట్ శంకర్ సెన్సార్.. విడుదల

ఇస్మార్ట్ శంకర్ సెన్సార్.. విడుదల

మాస్ ఆడియన్స్ ని ఉర్రూతలూగించేలా ఇస్మార్ట్ శంకర్ రూపొందించాడు పూరి జగన్నాథ్. రామ్‌ని సరికొత్తగా ఆవిష్కరిస్తూ మాస్ డైలాగ్స్, రొమాన్స్, కామెడీ అన్నీ ఉండేలా జాగ్రత్త పడ్డాడు. అయితే కాస్త రొమాన్స్ డోస్ ఎక్కువ అనిపిస్తుండటంతో సెన్సార్ బోర్డు ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికర అంశంగా మారింది. జులై 18 వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X