మొత్తానికి కారణం పూరీ జగన్నాథే: కీలక వ్యాఖ్యలు చేసిన రామ్ చరణ్.. ఇండస్ట్రీలో చర్చ

Recommended Video

Ram Charan Comments On iSmart Shankar Movie || Filmibeat Telugu

తెలుగు సినీ ఇండస్ట్రీలోని అందరు హీరోలతో సినిమాలు చేసిన దర్శకుల్లో పూరీ జగన్నాథ్ ఒకరు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న ఆయన.. ఎనర్జిటిక్ స్టార్ రామ్‌తో చేసిన చిత్రమే 'ఇస్మార్ట్ శంకర్'. గత వారం విడుదలైన ఈ సినిమా మొదట మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత క్రమంగా పుంజుకుని హిట్ చిత్రంగా నిలిచింది. విడుదలైన అన్ని కేంద్రాల్లో హౌస్‌ఫుల్ షోలతో దూసుకుపోతోంది. అలాగే భారీ స్థాయిలో కలెక్షన్లు సాధిస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నో రికార్డులను తిరగరాసింది. తాజాగా ఈ సినిమాకు ఊహించని బూస్ట్ వచ్చింది.

 కలెక్షన్ల వర్షం

కలెక్షన్ల వర్షం

జులై 18వ తేదీన విడుదలైన ‘ఇస్మార్ట్ శంకర్'.. బీ, సీ సెంటర్లలో దూసుకుపోతోంది. పక్కా మాస్ మసాలా చిత్రం కావడంతో ఈ పరిస్థితి వచ్చింది. ఫలితంగా రెండు రాష్ట్రాల్లో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. గురువారంతో వారం రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 27.67 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

సక్సెస్ టూర్

సక్సెస్ టూర్

సినిమా గ్రాండ్ సక్సెస్ అవడంతో చిత్ర యూనిట్ విజయోత్సవ యాత్ర చేస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కర్నూల్, విజయవాడ సహా ఎన్నో ప్రాంతాల్లో పూరీ జగన్నాథ్, ఛార్మీ, నిధి అగర్వాల్ పర్యటించారు. అలాగే, మరికొన్ని ప్రాంతాల్లో కూడా విజయ యాత్ర చేస్తామని చిత్ర యూనిట్ వెల్లడించింది.

రామ్ చరణ్ స్పందన

రామ్ చరణ్ స్పందన

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురువారం రాత్రి ఈ సినిమాను చూశాడు. అనంతరం చిత్ర యూనిట్‌కు ఆయన అభినందనలు తెలిపాడు. ఈ మేరకు తన ఫేస్‌బుక్ ఖాతాలో ‘‘ఇస్మార్ట్ శంకర్ హీరో రామ్.. ఇతర నటీనటులు ఎనర్జిటిక్‌గా నటించారు. ఈ సినిమా ఇలా రావడానికి కారణమైన పూరీ జగన్నాథ్ గారికి కంగ్రాట్స్'' అంటూ పోస్ట్ చేశాడు.

చరణ్ స్పందనతో కొత్త వాదన

చరణ్ స్పందనతో కొత్త వాదన

రామ్ చరణ్ ఈ సినిమాపై స్పందించడంతో పూరీ జగన్నాథ్ మెగా కాంపౌండ్‌కు వెళ్లబోతున్నాడా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పలువురు నెటిజన్లు. అందుకే చెర్రీ ఈ సినిమా చూశాడని కూడా అంటున్నారు. ఒకవేళ సినిమా చేస్తే.. మెగా హీరోల్లోని ఎవరితో ఆయన సినిమా చేస్తాడన్న దానిపై కూడా నెటిజన్లు కొత్త వాదనలు తెరపైకి తెస్తున్నారు.

 ‘ఇస్మార్ట్ శంకర్' గురించి

‘ఇస్మార్ట్ శంకర్' గురించి

విజయం కోసం పరితపిస్తున్న పూరీ జగన్నాథ్ - ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్'. పూరి సొంత బ్యానర్ టూరింగ్ టాకీస్, సీనియర్ హీరోయిన్ ఛార్మీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో రామ్ సరసన నిధీ అగర్వాల్, నభా నటేశ్‌ నటించారు. అలాగే, ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూర్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X