»   » టాప్ 50లో.... టాలీవుడ్ నుండి రామ్ చరణ్‌ మాత్రమే!

టాప్ 50లో.... టాలీవుడ్ నుండి రామ్ చరణ్‌ మాత్రమే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ మెన్స్ మేగజైన్ జిక్యూ ఇటీవల టాప్ 50 ఇండియన్ బెస్ట్ డ్రెస్డ్ సెలబ్రిటీల లిస్టు రిలీజ్ చేసింది. ఈ లిస్టులో టాలీవుడ్ నుండి కేవలం రామ్ చరణ్ కు మాత్రమే చోటు దక్కడం చర్చనీయాంశం అయింది.

తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లాంటి వారికి కూడా ఇందులో చోటు దక్కలేదు. అయితే కేవలం బాలీవుడ్లో నటించిన హీరోలను పరిగణలోకి తీసుకుని ఈ లిస్టు విడుదల చేశారని, అందుకే ఇతర టాలీవుడ్ హీరోలెవరికీ ఇందులో చోటు దక్కలేదని అంటున్నారు.

రామ్ చరణ్

రామ్ చరణ్

రామ్ చరణ్ ‘జంజీర్' అనే బాలీవుడ్ చిత్రంలో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. అందుకే రామ్ చరణ్ ను కూడా ఈ లిస్టులో చేర్చినట్లు తెలుస్తోంది. 50 మందితో కూడిన ఈ లిస్టులో రామ్ చరణ్ 15వ స్థానం దక్కించుకున్నాడు.

స్పెషల్ అట్రాక్షన్

స్పెషల్ అట్రాక్షన్

రామ్ చరణ్ ఏ కార్యక్రమానికి వెళ్లినా చాలా స్పెషల్ గా కనిపిస్తాడు. అతడి స్టైల్ స్టేట్మెంట్ ఇతర హీరోలకంటే భిన్నంగా ఉండటం కూడా రామ్ చరణ్ కు ఇలాంటి గుర్తింపు కావడానికి కారణమైనట్లు స్పష్టమవుతోంది.

తన కోసమే ప్రత్యేకంగా...

తన కోసమే ప్రత్యేకంగా...

రామ్ చరణ్ తన కోసమే ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రెస్సులను మాత్రమే వేసుకుంటాడట. రామ్ చరణ్ స్టైల్ విషయంలో ఆయన సోదరి, స్టైలిస్ట్ సుష్మిత కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని తెలుస్తోంది.

వెరైటీగా ఉంది: రామ్ చరణ్-సుకుమార్ మూవీ టైటిల్ ప్రకటన!

వెరైటీగా ఉంది: రామ్ చరణ్-సుకుమార్ మూవీ టైటిల్ ప్రకటన!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ టైటిల్ ఖరారైంది. ఈ చిత్రానికి 'రంగస్థలం 1985' అనే టైటిల్ ఖరారు చేశారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
India's leading Men's magazine GQ has recently unveiled the list of Top 50 Best Dressed Celebs, and Ram Charan is the only hero from Tollywood to feature in the Top 50.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu