‘ఇస్మార్ట్ శంకర్’ డైరెక్టర్ పూరీ కాదు రామ్.. ఈ వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది.!
'ఇస్మార్ట్ శంకర్'.. తెలుగు రాష్ట్రాల్లో రెండు వారాలుగా ఎవరి నోట విన్నా ఆ సినిమా మాటే వినిపిస్తుంది. ఎక్కడకు వెళ్లినా అదే హడావిడి దర్శనమిస్తోంది. ఎవరిని కదిపినా దాని గురించే మాట్లాడుతున్నారు. దీనికి కారణం ఈ సినిమా ఫలితమే. చాలా కాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న పూరీ జగన్నాథ్ - ఎనర్జిటిక్ స్టార్ రామ్ కలయికలో వచ్చిన మాస్ మసాలా సినిమానే 'ఇస్మార్ట్ శంకర్'. విడుదలైనప్పుడు మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా క్రమంగా హిట్ చిత్రాల జాబితాలోకి వెళ్లిపోయింది. కలెక్షన్లు కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఓ వీడియోను విడుదల చేసింది. ఇది చూసిన తర్వాత ఈ సినిమా డైరెక్టర్ పూరీనా.? రామ్‌నా.? అనే సందేహం కలుగుతుంది.

భారీ కలెక్షన్లు
‘ఇస్మార్ట్ శంకర్' విడుదలైన రోజు నుంచి కలెక్షన్ల మోత మోగిస్తుంది. ఈ సినిమాకు మొదటి ఎనిమిది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 63 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిందని చిత్ర నిర్మాతల్లో ఒకరైన సీనియర్ హీరోయిన ఛార్మీ తెలిపింది. ఇప్పటికీ అదే జోరును కొనసాగిస్తోంది. దీంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీగా ఉంది.

ఏపీ టూర్ సక్సెస్
కొద్దిరోజుల క్రితం ‘ఇస్మార్ట్ శంకర్' టీమ్ ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, అనంతపురం, విజయవాడ, ఏలూరు, భీమవరం, విశాఖపట్నం సహా పలు పట్టణాల్లో పర్యటించింది. అక్కడ ఈ సినిమాకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చిందని డైరెక్టర్ పూరీ జగన్నాథ్ స్వయంగా వెల్లడించారు. ముఖ్యంగా బీ, సీ సెంటర్లలో సినిమాకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందని చెప్పారు.

ఇప్పుడు తెలంగాణ టూర్
ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడకు వెళ్లినా విపరీతమైన రెస్పాన్స్ వస్తుండడంతో, చిత్ర యూనిట్ తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించాలని డిసైడ్ అయింది. ఇందులో భాగంగానే జూలై 29 నుంచి సక్సెస్ టూర్‌ను ప్రారంభించింది. మొదటి రోజు ఖమ్మం జిల్లా పర్యటనతో ఇది ప్రారంభమైంది.
రామ్ డైరెక్షన్
ఈ సినిమా ప్రారంభంలో వచ్చే టైటిల్ సాంగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందులో మణిశర్మ సంగీతానికి రామ్ డ్యాన్స్‌కు ప్రేక్షకుల నుంచి ఊహించని రీతిలో స్పందన వచ్చింది. ఇక, ఇదే పాటలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కూడా ఒక షాట్‌లో కనిపిస్తాడు. దాన్ని డైరెక్ట్ చేసింది హీరో రామే. దీనికి సంబంధించిన వీడియోను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది.

విదేశాల్లో రామ్
‘ఇస్మార్ట్ శంకర్' విడుదలైన సమయంలో హీరో రామ్ ఇక్కడ లేడు. అతడు విదేశీ పర్యటనకు వెళ్లాడు. దీంతో రామ్ లేకుండానే చిత్ర యూనిట్ సక్సెస్ మీట్లు, టూర్లు వెళుతోంది. ఇక, రేపో ఎల్లుండో అతడు హైదరాబాద్ రానున్నాడు. మరి వచ్చిన తర్వాత అయినా చిత్ర యూనిట్‌తో కలుస్తాడో లేదో చూడాలి.

‘ఇస్మార్ట్ శంకర్' గురించి..
పూరీ జగన్నాథ్ - రామ్ కలయికలో వచ్చిన చిత్రమే ‘ఇస్మార్ట్ శంకర్'. పూరి సొంత బ్యానర్ టూరింగ్ టాకీస్, సీనియర్ హీరోయిన్ ఛార్మీ సంయుక్తంగా నిర్మించిన ‘ఇస్మార్ట్ శంకర్'లో రామ్ సరసన నిధీ అగర్వాల్, నభా నటేశ్ నటించారు. అలాగే, ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూర్చారు.


Click it and Unblock the Notifications











