పార్టీలో పూరీ, వర్మ, ఛార్మీ రచ్చరచ్చ.. వీకెండ్‌లో ఫుల్ మస్తీ.. జోష్
వారాంతం వచ్చిదంటే రాంగోపాల్ వర్మ బృందానికి పండుగే. వారంరోజులు కష్టానికి పార్టీలతో చెక్ పెడుతుంటారు ఈ సెలబ్రిటీ బృందం.
వారాంతం వచ్చిదంటే రాంగోపాల్ వర్మ బృందానికి పండుగే. వారంరోజులు కష్టానికి పార్టీలతో చెక్ పెడుతుంటారు ఈ సెలబ్రిటీ బృందం. ఎప్పటిలానే ఆర్జీవి, పూరి జగన్నాథ్‌తో కూడిన బ్యాచ్ శనివారం రాత్రి పార్టీని బాగా ఎంజాయ్ చేశారు. ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోలపై మీరు ఓ లుక్కేయండి..
హైదరాబాద్ పార్టీలో వర్మ
శివ సినిమా తర్వాత నాగార్జునతో మరో చిత్రాన్ని రూపొందించే పనిలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఉన్నారు. ఈ సినిమా కోసం హైదరాబాద్‌లోనే మకాం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన పార్టీలో రామ్ గోపాల్ వర్మ పాల్గొన్నాడు. ఓ వీడియోలో పూరీతో మాట్లాడుతూ.. సూపర్ డూపర్ హిట్స్ అనే మాట వినిపించింది.
వీకెండ్ పార్టీలో పూరీ, వర్మ
పూరీ జగన్నాథ్ బృందం మెహబూబా షూటింగ్‌ను హిమాచల్ ప్రదేశ్‌లో పూర్తి చేసుకొని పూరీ హైదరాబాద్ వచ్చారు. వీకెండ్‌ని ఇటు పూరీ అటు వర్మ సరదాగా గడిపారు.
ఛార్మీ వీడియోలు వైరల్
ఈ పార్టీలో ఎంజాయ్‌మెంట్‌కి సంబంధించిన వీడియోలని సినీ నటి ఛార్మి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇందులో పూరీ తనయుడు ఆకాశ్‌తోపాటు పలువురు టెక్నీషియన్స్ కూడా కనిపించారు.

ఎంజాయ్ మూడ్‌లో వర్మ
వర్మ, పూరి, ఆకాష్, మరికొందరు ఉన్న ఈ వీడియోలో ఓ వ్యక్తి వయోలిన్ ప్లే చేస్తుండగా వర్మ, పూరిలు ఆ సంగీతాన్ని ఎంజాయ్ చేస్తూ కనిపించారు. అంతేకాదు వర్మ ఏకంగా ఆ అతని కాళ్లు తాకి మరి మ్యూజిక్ సూపర్ అంటూ పొగిడేశాడు.


Click it and Unblock the Notifications











