వోడ్కా మైకంలో శ్రీదేవిని చూస్తూ నేలపై రామ్ గోపాల్ వర్మ ఇలా... (వీడియో)
రామ్ గోపాల్ వర్మ వోడ్కా కొట్టి శ్రీదేవి సాంగ్ చూస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. శ్రీదేవి పాట చూస్తూ వర్మ నేలపై భక్తుడిలా కూర్చున్న ఈ వీడియోను చార్మి పోస్టు చేశారు.
రామ్ గోపాల్ వర్మకు శ్రీదేవి అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమెను తాను దేవతలా ఆరాధిస్తాను అని చాలా సార్లు చెప్పారు. తాజాగా శ్రీదేవిని హోమ్ థియేటర్లో చూస్తూ తనను తాను మైమరిచిపోయిన వర్మ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ వీడియోను పోస్టు చేసింది మరెవరో కాదు.... నటి చార్మి. ఇందులో వర్మ నేలపై కూర్చుని శ్రీదేవిని చూస్తూ లీనమైపోయారు. సన్ని డియోల్, శ్రీదేవి కలిసి నటించిన 'ఛాల్‌బాజ్' అనే హిందీ చిత్రంలోని 'నా జానే కహాసే..' పాటను చూస్తూ వర్మ ఈ లోకాన్నే మరిచిపోయాడు.
భక్తుడు రామ్ గోపాల్ వర్మ
ఈ వీడియోను పోస్టు చేసిన ఛార్మి.... ‘భక్తుడు రామ్ గోపాల్ వర్మ శ్రీదేవి కోసం ఇక్కడ నేలపై కూర్చొని ఉన్నారు. రాముఇజం, ఆయన ఫ్యానిజం' అంటూ క్యాప్షన్ పెట్టారు.

పూరి ఆఫీసులో తీసిన వీడియో
ఈ వీడియో పూరి జగన్నాథ్ ఆఫీసులో తీసినట్లు తెలుస్తోంది. వర్మ, పూరి మధ్య గురు శిష్యుల అనుబంధం ఉంది. తీరిక సమయాల్లో వర్మ పూరి ఆఫీసులో గడపటం సర్వసాధారణం. పూరీ దర్శకత్వం వహిస్తున్న ‘మెహబూబా' చిత్రం నిర్మాణ బాధ్యతల్ని ఛార్మి చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ వీడియో తీసినట్లు తెలుస్తోంది.
పూరితో కలిసి వోడ్కా కొట్టిన వర్మ
చార్మి ఈ వీడియో పోస్టు చేయడానికి ముందు వర్మ, పూరి కలిసి వోడ్కా కొట్టిన వీడియోను చార్మి పోస్టు చేసింది. ఈ వీడియోలో వర్మ వేసుకున్న డ్రెస్, శ్రీదేవి పాట చూస్తున్న వీడియలో వర్మ వేసుకున్న డ్రెస్ ఒకేలా ఉన్నాయి. వోడ్కా కొట్టిన తర్వాతే వర్మ ఇలా శ్రీదేవి మైకంలో మునిగిపోయినట్లు అర్థం చేసుకోవచ్చు.

వర్మ ప్రస్తుతం చేస్తున్న మూవీస్
ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ నాగార్జునతో ఓ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' పేరుతో బయోపిక్ తెరకెక్కించబోతున్నారు.

కొడుకుతో పూరి ‘మొహబూబా’
‘మెహబూబా' చిత్రాన్ని పూరి జగన్నాథ్ తన కొడుకు ఆకాష్ పూరితో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ద్వారా తన కుమారుడికి మంచి బ్రేక్ ఇవ్వాలని చూస్తున్నారు. ప్రేమకథా చిత్రంగా దీన్ని రూపొందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











