»   » ప్రజారాజ్యం కన్నా డిజాస్టర్.. జనసేనపై వర్మ కామెంట్, ఎవరికన్నా చూపించండి అంటున్న శ్రీరెడ్డి!

ప్రజారాజ్యం కన్నా డిజాస్టర్.. జనసేనపై వర్మ కామెంట్, ఎవరికన్నా చూపించండి అంటున్న శ్రీరెడ్డి!

Subscribe to Filmibeat Telugu
Ram Gopal varma Comments On Janasena Party

రాంగోపాల్ వర్మ, శ్రీరెడ్డి ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన వ్యక్తులు. పవన్ కళ్యాణ్ తల్లిని తానే తిట్టించానని వర్మ స్వయంగా ప్రకటించుకోవడం తన వికృత చేష్టలకు పరాకాష్ట అని చెప్పొచ్చు. వర్మ తన వ్యాఖ్యలతో ఎదుటివారిని కవ్వించే చర్యలు మాత్రం ఎప్పటికి మానడు అని మరో మారు రుజువైంది. పవన్ కళ్యాణ్ ఫాన్స్ టార్గెట్ గా ట్విట్టర్ లో వర్మ కామెంట్స్ సాగుతున్నాయి. ఇటీవల రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున నటించిన ఆఫీసర్ చిత్రం రెండవ టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ టీజర్ కు భారీ స్థాయిలో డిస్ లైక్స్ పడుతున్నాయి. లైక్స్ తో దాదాపు సమానంగా డిస్ లైక్స్ వస్తుండడం గమనార్హం. దీనిపై వర్మ సోషల్ మీడియాలో స్పందించారు. పవన్ కళ్యాణ్ ఫాన్స్ పనే అని వర్మ అంటున్నాడు. శ్రీరెడ్డి కూడా దీనిపై స్పందించడం ఆసక్తిగా మారింది.

రగిలిపోతున్న పవన్ ఫాన్స్

రగిలిపోతున్న పవన్ ఫాన్స్

పవన్ కళ్యాణ్ తల్లిని శ్రీరెడ్డి మీడియా ముఖంగా సహనం కోల్పోయి మాట్లాడుతూ వికృత చేష్టలకు పాల్పడింది. పవన్ కళ్యాణ్ తల్లిని దారుణంగా దూషించిన సంగతి తెలిసిందే. ఇందులో అసలు సూత్రధారి తానే అనే వర్మ ఒప్పుకున్నాడు. అప్పటినుంచి పవన్ అభిమానులు అతడిపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

పవన్ ఆలోచన మరోలా

పవన్ ఆలోచన మరోలా

శ్రీరెడ్డి, వర్మ కాకుండా ఈ నివహమైన పనికి ఒడికట్టిన వారిలో కొన్ని మీడియా సంస్థల అధినేతలు, రాజకీయ శక్తులు ఉన్నారని పవన్ కళ్యాణ్ భావిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే తనతల్లిని దూషించినా శ్రీరెడ్డి గురించి పవన్ మాట్లాడలేదు. చీకట్లో ఉండి ఈ వ్యవహారాన్ని నడిపిన వారిని రోడ్డుకు లాగాలని పవన్ ప్రయత్నిస్తున్నారు.

నాగార్జున సినిమాని టార్గెట్ చేసిన ఫాన్స్

నాగార్జున సినిమాని టార్గెట్ చేసిన ఫాన్స్

వర్మ పై ఉన్న కోపంతో పవన్ కళ్యాణ్ అభిమానులు నాగార్జున ఆఫీసర్ సినిమాని టార్గెట్ చేసారు. ఇటీవల ఆఫీసర్ చిత్ర రెండవ టీజర్ విడుదలయింది. పవన్ అభిమానులు ఆ టీజర్ కి డిస్ లైక్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఇది పవన్ అభిమానుల పనే అని వర్మ అంటున్నాడు.

తనకు అనుకూలంగా

తనకు అనుకూలంగా

తిమ్మిని బమ్మి చేయడంలో వర్మని మించినోడు లేడు. అందుకు పవన్ ఫాన్స్ ఆఫీసర్ చిత్రాన్ని టార్గెట్ చేసారని, ఈ విషయాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటూ వర్మ సెటైర్లు విసురుతున్నాడు. వర్మ దీనిపై స్పందించే సమయానికి ఆఫీసర్ చిత్ర టీజర్ కు 11 వేల డిస్ లైక్స్ ఉన్నాయి. ప్రస్తుతం 14 వేలకుపైగా డిస్ లైక్స్ ఉన్నాయి. లైక్స్ తో దాదాపు సమానంగా డిస్ లైక్స్ ఉండడం గమనించదగ్గ విషయం.

వర్మ సెటైర్లు

వర్మ సెటైర్లు

దాదాపు 11 కోట్ల మంది ఉన్న తెలుగు వారిలో పవన్ కళ్యాణ్ ఫాన్స్ కేవలం 11 వేలమందేనా అంటూ ట్విట్టర్ లో కామెంట్ చేసాడు వర్మ. పవన్ కళ్యాణ్ అభిమానుల గురించి కామెంట్ చేస్తూ జనసేన, ప్రజారాజ్యం పార్టీ గురించి కూడా సెటైర్ వేసాడు.

ప్రజారాజ్యం కన్నా డిజాస్టర్

పవన్ కళ్యాణ్ అభిమానులు కేవలం 11 వేలమందే ఉంటే జనసేన పార్టీ ప్రజారాజ్యం కన్నా డిజాస్టర్ అయ్యే ప్రమాదం ఉందని వర్మ అన్నాడు. దీని గురించి జనసేన పార్టీ సీరియస్ గా ఆలోచించుకోవాలంటూ సలహా ఇచ్చాడు.

శ్రీరెడ్డి కూడా

శ్రీరెడ్డి కూడా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఫాన్స్ ని ఉద్దేశించి కామెంట్స్ చేసింది. వీడియోలకు డిస్ లైకులు కొట్టడం, పోస్ట్ ల కింద పచ్చి బూతులు రాయడం తప్ప వారికి మరో పనిలేదంటూ వ్యాఖ్యానించింది. పవన్ కళ్యాణ్ అభిమానులని ఎవరికన్నా చూపించాలని సెటైర్ వేసింది.

English summary
Ram GopalVarma setires on Pawan Kalyan fans and Janasena Party. SriReddy also comments on Pawan fans
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X