Ram Gopal Varma: పవన్ కల్యాణ్‌కు పోటీగా రామ్ గోపాల్ వర్మ.. సడెన్‌గా పొలిటికల్ ఎంట్రీ!
ఒకప్పుడు శివ సినిమా తీసి టాలీవుడ్ టాప్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఒకప్పుడు సినిమాల మీదే ఫోకస్ పెట్టిన ఈయన ఆ తర్వాత అనేక విషయాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. తాజాగా ఈయన మరో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు పోటీగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటింటారు. ఆ విషయాన్ని నేరుగా ఆయనే తెలిపారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య ఏపీ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ముఖ్యంగా వైసీపీకీ సపోర్ట్ చేసే విధంగా సినిమాలు కూడా తెరకెక్కించారు. ముఖ్యంగా వ్యూహం, శపథం వంటి సినిమాలు తీసుకువచ్చి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డిల కథను చూపించారు. ఇందులో జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడిపై నిప్పులు చెరిగారు. అలాగే సోషల్ మీడియా వేధికగా ప్రతీసారి వీరిపై విమర్శలు చేస్తూ సెన్సషన్ క్రియేట్ చేశారు.

నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన కుమారుడు నారా లోకేష్, జనసేనాని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై ఇష్టం వచ్చినట్లుగా కామెంట్లు చేస్తున్నారు. నెట్టింట వారి గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న ఈయన.. తాజాగా మరో షాకింగ్ న్యూస్ చెప్పారు. ముఖ్యంగా తాను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. సడెన్ డెసీషన్ అంటూ చెప్పిన ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారో కూడా వివరించారు.
OTTలోకి సూపర్ హార్రర్ క్రైమ్ డ్రామా సిరీస్.. డేర్ ఉంటే డోంట్ మిస్.. ఎక్కడ చూడాలంటే?
ముఖ్యంగా తాను కాకినాడ జిల్లా పిఠాపురం నియోజక వర్గం నుంచి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. ఎక్స్ వేధిగా ఈ విషయం చెప్పిన ఆయన.. తాను ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు తన అభమానులతో పంచుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుందని అన్నారు. అయితే రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఆయన సడెన్ పొలిటికిల్ ఎంట్రీ ఒకెత్తు అయితే పవన్ కల్యాణ్ కు పోటీగా అదే అసెంబ్లీ నియోజక వర్గంలో నిలబడడం మరో ఆసక్తికర అంశం.
జనసేన అధ్యక్షుడు, హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజక వర్గం నుంచి పోటీ చేయబోతున్నట్లు తాజాగా ప్రకటించారు. అలాగే తాను ఎమ్మేల్యేగానే పోటీ చేయబోతున్నానని క్లారిటీ ఇచ్చారు. ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయనని కూడా స్పష్టం చేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న డైరెక్టర్ రాం గోపాల్ వర్మ పవన్ కల్యాణ్ కు పోటీగా తాను కూడా పిఠాపురంలో పోటీ చేస్తానని వివరించారు. ఏదో ఉత్తిగా అలా చెప్పారా లేక నిజంగానే రామ్ గోపాల్ వర్మ పోటీ చేస్తారా అనేది తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











