వీళ్లిద్దరూ కలిస్తే హాట్‌గా ఉంటది.. బాక్సాఫీస్ బర్న్ అయిపోతుంది: రాంగోపాల్ వర్మ
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ - డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. పూరి, ఛార్మి నిర్మాతలు. ప్రొడక్షన్ బాధ్యతలు ఛార్మీ దగ్గరుండి చూసుకోనుంది. ఈ చిత్రాన్ని లావణ్య సమర్పిస్తున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై అప్పుడే ఊహాగానాలు, అంచనాలు ప్రారంభమయ్యాయి.
సోమవారం ఈ సినిమా ప్రకటన చేసిన వెంటనే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ దీనిపై స్పందించాడు. ఈ మేరకు తన ట్విట్టర్‌లో ఛార్మీ చేసిన ట్వీట్‌ను షేర్ చేశాడు. అంతేకాదు, 'వావ్.. విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ రెడ్ హాట్‌లా ఉంటుంది. ఈ సినిమా బాక్సాఫీస్‌ను బర్న్ చేయడం ఖాయం. ఇస్మార్ట్‌గా ఉన్న ఛార్మీకి కంగ్రాట్స్' అంటూ రాసుకొచ్చాడు.
వర్మకు - పూరీకి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే వర్మ.. పూరీ ప్రతి సినిమాకూ ఏదో విధంగా సహకారం అందిస్తూనే ఉంటాడు. 'ఇస్మార్ట్ శంకర్' సమయంలోనూ ప్రమోషన్‌కు బాగా ఉపయోగపడ్డాడు. ఈ సినిమాను బైక్ మీద వెళ్లి చూడడం.. బీరు పార్టీలో రచ్చ రచ్చ చేయడం వంటి వాటితో బాగా ప్రచారం లభించింది.

ఈ నేపథ్యంలో సినిమా గురించి ఎన్నో కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. సినిమా కోసం పూరీ జగన్నాథ్ పక్కా మాస్ మసాలా కథను రెడీ చేసినట్లు తెలుస్తోంది. తన గత చిత్రం 'ఇస్మార్ట్ శంకర్' హిట్ తర్వాత ఇకపై మాస్ సినిమాలే చేస్తానని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే మరో మాస్ స్టోరీని సిద్ధం చేసేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే, ఇందులో విజయ్.. మాటలు రాని వ్యక్తిగా కనిపిస్తాడని కూడా వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











