వంద మిలియన్ల ఇస్మార్ట్.. మీ వల్లే ఈ పిచ్చి సర్ అంటోన్న రామ్
ఒక్క సినిమా ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపింది. ఇస్మార్ట్ శంకర్ రూపంలో దర్శకుడు పూరి జగన్నాద్‌కు, హీరోగా రామ్‌కు, హీరోయిన్లైన నిధి అగర్వాల్, నభా నటేష్‌లు సక్సెస్ రుచి చూశారు. ఈ దెబ్బతో పూరీ, రామ్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. మాస్ మంత్రం పవర్ ఏంటో నిరూపించిన పూరి, రామ్‌లు తమ తదుపరి ప్రాజెక్ట్‌లతో బిజీ అయిపోయారు.
ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిన జోరుతో భవిష్యత్ ప్రాజెక్ట్‌లు చకచకా రెడీ చేశారు. కానీ ఇస్మార్ట్ క్రియేట్ చేస్తున్న సంచలనాలు రోజురోజుకూ పెరిగిపోతోన్నాయి. యూట్యూబ్‌లో ఇస్మార్ట్ పాటలు ఓ రేంజ్‌లో ట్రెండ్ అయ్యాయి. తాజాగా ఇస్మార్ట్ శంకర్ హిందీ డబ్బింగ్ వర్షెన్ కొత్త రికార్డును క్రియేట్ చేసింది. అసలే మన తెలుగు మాస్ మసాలా సినిమాలకు అక్కడ గిరాకీ ఎక్కువగా ఉంటుంది.

అందుకే మన నిర్మాతలు డబ్బింగ్ రూపంలో బాగానే సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా ఇస్మార్ట్ శంకర్ వంద మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. దీన్ని బట్టే అర్థమవుతోంది కదా.. మన తెలుగు సినిమాల సత్తా ఏమిటని. తమ సినిమా వంద మిలియన్ల వ్యూస్‌ను సాధించడంపై హీరో రామ్, దర్శకుడు పూరి ఆనందం వ్యక్తం చేశారు. ఇది రామ్ మ్యాడ్ నెస్ అంటూ పూరి ట్వీట్ చేయగా.. మీరే దాన్ని సృష్టించింది సర్ థ్యాంక్యూ అని రిప్లై ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











