twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పూరీకి బూతులతోనే చెప్పాలంటున్న రామ్.. ఆసక్తికరంగా మారిన ట్వీట్

    |

    టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ తాజాగా నటించిన చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. పూరి సొంత బ్యానర్ టూరింగ్ టాకీస్, సీనియర్ హీరోయిన్ ఛార్మీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో రామ్ సరసన నిధీ అగర్వాల్, నభా నటేశ్‌ నటించారు. అలాగే, ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూర్చారు. గురువారం విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో రామ్, పూరీ అభిమానులతో సహా చిత్ర బృందం ఖుషీగా ఉంది.

    చాలా కాలంగా సరైన హిట్ పడక ఇబ్బంది పడుతున్న రామ్ ఈ సినిమా కోసం ఎన్నో మార్పులు చేసుకున్నాడు. లుక్, బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకుని సరికొత్తగా ట్రై చేశాడు. ఈ సినిమాలో రామ్ నటనకు, అతడి తెలంగాణ స్లాంగ్, బాడీ లాంగ్వేజ్‌లకు మంచి మార్కులే పడ్డాయి. అలాగే పూరీ కొత్త పాయింట్‌ను తీసుకొచ్చినప్పటికీ టేకింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే సినిమా మరింత బాగుండేదన్న టాక్ వినిపిస్తోంది. మొత్తంగా ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో రన్ అవుతోంది.

    Ram Pothineni Comments On Puri Jagannadh

    అంతేకాదు, కలెక్షన్ల పరంగానూ దూసుకుపోతోంది. ఈ సినిమా విడుదలైన తొలి రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 7.8 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. ఈ మేరకు కలెక్షన్ రిపోర్ట్ తెలుపుతూ సోషల్ మీడియా ద్వారా ఆనందం వ్యక్తం చేసింది చిత్రయూనిట్. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే.. తొలి రోజు మొత్తంగా 16 కోట్ల షేర్ వసూలు చేసింది ఇస్మార్ట్ శంకర్. దీంతో చిత్ర యూనిట్‌తో పాటు బయ్యర్లు కూడా సంతృప్తిగానే ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది.

    'ఇస్మార్ట్ శంకర్' హిట్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో పాటు సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుండడంతో చిత్ర హీరో రామ్.. ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ఈ సినిమాను భారీ హిట్ చేసిన ప్రేక్షకులకు, ఫ్యాన్స్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. అలాగే పూరీ జగన్నాథ్ గురించి కూడా ట్వీట్ చేశాడు. ''డియర్ పూరీ జ‌గన్నాథ్ గారూ.. సినిమా న‌చ్చితే పొగుడుతాం. న‌చ్చ‌క‌పోతే బూతులు తిడ‌తాం. కానీ, మిమ్మ‌ల్ని మాత్రం ఏంటండి బూతుల‌తో పొగ‌డ‌బుద్ధవుతోంది. నా మీద చూపించిన ప్రేమ‌కు ధ‌న్య‌వాదాలు. అది తెరపై కనిపించింది'' అని రామ్ ట్వీట్ చేశాడు. ఇది చూసిన అభిమానులు రీ ట్వీట్లు చేస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.

    English summary
    Tollywood Star talented Puri Jagannath, ram pothineni making iSmart Shankar. This Film Released Friday. And This Film Running Successfully. So.. Ram Pothineni Tweet On Director Puri Jagannadh.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X