హీరో రామ్ కోసం తెగించిన అభిమాని.. టచ్ చేసిందంటూనే క్లాస్ పీకిన ‘ఇస్మార్ట్ శంకర్’!

Recommended Video

Fan Risks For Hero Ram | Ram Pothineni Emotional Tweet About His Fan || Filmibeat Telugu

మన దేశంలో సినిమా స్టార్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రపంచంలో మరెక్కడా కనిపించని వింత వింత సంఘటనలు ఇక్కడ కనిపిస్తాయి. నటీనటుల పట్ల తమ అభిమానం చాటుకునేందుకు చాలా మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అంతేకాదు, చాలా చోట్ల తమ అభిమాన నటులను దేవుళ్లుగా కొలిచే సంప్రదాయం కూడా ఇక్కడ కనిపిస్తుంది. గతంలో దక్షిణాదిలో కుస్భూ సహా కొందరు నటీమణులకు గుడి కట్టిన సందర్భాలు కూడా చూశాం. అయితే, తాజాగా తెలుగు రాష్ట్రంలో ఓ అభిమాని తనకు ఇష్టమైన హీరో సినిమా సక్సెస్ అవ్వాలని సాహసమే చేశాడు.

సినిమా హిట్ అవ్వాలని..

సినిమా హిట్ అవ్వాలని..

సందీప్ కుమార్ అనే వ్యక్తి ఎనర్జిటిక్ హీరో రామ్‌కు వీరాభిమాని. రామ్ తాజాగా చేసిన చిత్ర ‘ఇస్మార్ట్ శంకర్'. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ‘ఇస్మార్ట్ శంకర్' బంపర్ హిట్ సాధించాలని సందీప్ తిరుపతికి మోకాళ్లపై నడుచుకుంటూ వెళ్లాడు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ‘‘@ramsayz ఆ తిరుమల వేంకటేశ్వరుని వద్దకు తిరుపతిలో మోకాళ్ళతో నడిచి వెళ్లడం జరిగింది. కచ్చితంగా ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అయి గత వైభవాన్ని మళ్ళీ మాకు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకున్నా.. మీ సందీప్'' అని ట్వీట్ చేశాడు.

హీరో రామ్ స్పందన

హీరో రామ్ స్పందన

సందీప్ చేసిన పనిపై హీరో రామ్ స్పందించాడు. ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. సందీప్ అభిమానాన్ని మెచ్చుకుంటూనే, ఇలాంటి పనుల వల్ల నటులుగా ఇబ్బంది పడుతున్నామని చెప్పుకొచ్చాడు. ‘‘నటులుగా మేమెప్పుడూ మీ నుంచి ఇలాంటివి కోరుకోము. దానిని మీరు అర్థం చేసుకోవాలి. అమితమైన ప్రేమను చూపించే సమయంలో ఇలాంటివి చేయకండి'' అంటూ ట్వీట్ చేశాడు.

లేఖ విడుదల

లేఖ విడుదల

అభిమానులందరినీ ఉద్దేశించి ట్వీట్ చేసిన రామ్.. సందీప్ కోసం ఓ లేఖను సైతం విడుదల చేశాడు. ‘‘డియర్ సందీప్.. నీ వీడియో చూసి షాకయ్యాను. అది నన్ను టచ్ చేసింది. అలాగే బాధకు గురి చేసింది. నువ్వు క్షేమంగానే ఉన్నావని అనుకుంటున్నాను. మీ నుంచి ఇంత ప్రేమను దక్కించుకున్నందుకు నేనేం చేశానో ఇప్పటికీ అర్థం కావడం లేదు. కానీ, నా హార్ట్ బీట్ ఎప్పటికీ నీలాంటి వాళ్ల కోసమే కొట్టుకుంటుంది'' అని అందులో పేర్కొన్నాడు. ఇది చూసిన సందీప్ ‘‘నేను క్షేమంగానే ఉన్నానన్నా'' అంటూ రిప్లై ఇచ్చాడు.

ఇస్మార్ట్ శంకర్ గురించి..

ఇస్మార్ట్ శంకర్ గురించి..

రామ్- పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్'. పూరీ సొంత బ్యానర్ టూరింగ్ టాకీస్, సీనియర్ హీరోయిన్ ఛార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ సరసన నిధీ అగర్వాల్, నభా నటేశ్‌ నటిస్తున్నారు. జూలై 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇందులో రామ్ సరికొత్త లుక్, డైలాగ్ డెలివరీని ప్రయత్నించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X