శంకర్ మళ్లీ వస్తున్నాడు.. ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీపై రామ్ కీలక ప్రకటన
సరైన హిట్ కొట్టాలనే కసితో టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ - టాలీవుడ్ బడా డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. పక్కా మాస్ మసాలా కథతో రూపొందిన ఈ సినిమాను బీ, సీ సెంటర్ల ప్రేక్షకులు సూపర్ డూపర్ హిట్ చేశారు. మొదట్లో మిక్స్‌డ్ టాక్‌ను దక్కించుకున్నప్పటికీ, క్రమంగా హిట్ చిత్రంగా నిలిచింది. తాజాగా ఈ సినిమా సీక్వెల్‌కు సంబంధించిన ఓ వార్త బయటకు వచ్చింది. దీంతో ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.

ఇద్దరి కెరీర్లను మార్చేసింది
జూనియర్ ఎన్టీఆర్‌తో తీసిన ‘టెంపర్' తర్వాత నుంచి పూరీ జగన్నాథ్ వరుసగా ఎన్నో సినిమాలు చేస్తూ వస్తున్నాడు. కానీ, అతడి ప్రతి ప్రయత్నం విఫలమవుతూనే వచ్చింది. అలాగే, రామ్‌కు కొన్ని హిట్లు వచ్చినప్పటికీ స్టార్ హీరో హోదాను కట్టబెట్టలేకపోయాయి. అయితే, ఇస్మార్ట్ శంకర్ తర్వాత వీరిద్దరి జాతకాలు మారిపోయాయి. పూరీ ఈ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కడంతో పాటు రామ్‌కు కూడా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ దక్కింది. దీంతో ఇద్దరి అభిమానులు ఖుషీగా ఉన్నారు.

కలెక్షన్లూ అదే స్థాయిలో
పక్కా మాస్ మసాలా చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్' విడుదలైన అన్ని ప్రాంతాల్లో భారీ వసూళ్లను రాబట్టింది. ఈ క్రమంలోనే మొత్తంగా రూ.35.51 కోట్ల షేర్ .. రూ. 71.35 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 32.70 కోట్లను కొల్లగొట్టిందీ సినిమా. అలాగే పక్క రాష్ట్రం కర్ణాటకలో రూ. 1.45 కోట్లను, ఓవర్సీస్, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తంగా రూ. కోటి వరకు రాబట్టింది.

ఆ సీక్వెల్‌లో నటిస్తాడని ప్రకటన
కొద్దిరోజుల క్రితం తన తదుపరి సినిమా గురించి పూరీ క్లారిటీ ఇచ్చేశాడు. ‘‘ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి హ్యాపీగా ఉంది. ఎక్కడకు వెళ్లినా ‘ఇస్మార్ట్ శంకర్ 2' ఎప్పుడు అని అడుగుతున్నారు. ఈ సినిమా సీక్వెల్ తీయాల్సిన పరిస్థితి వస్తుందని మేము ముందే ఊహించాం. అందుకే స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేసి, సీక్వెల్‌ను ఎంత వీలైతే అంత తొందరగా చేయాలి. ఇందుకోసం ‘డబుల్ ఇస్మార్ట్' అనే టైటిల్‌ను ఎప్పుడో రిజిస్టర్ చేసి పెట్టాను'' అని ఆయన చెప్పుకొచ్చాడు.

ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్‌పై రామ్ క్లారిటీ
తాజాగా ‘ఇస్మార్ట్ శంకర్' సీక్వెల్‌పై రామ్ ఓ ఇంగ్లీష్ పత్రికతో జరిగిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ‘‘పూరీ, నేను త్వరలోనే సినిమా చేయడం ఖాయం. అది ఇస్మార్ట్‌కు సీక్వెల్ అయినా అవ్వచ్చు.. ప్రీక్వెల్ అయినా కావచ్చు. ప్రస్తుతం ఇది చర్చల దశలో ఉంది. స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తయిన తర్వాత దీని గురించి చెబుతాం'' అని ప్రకటించాడు. దీంతో అటు రామ్ అభిమానుల్లోనూ.. ఇటు పూరీ ఫ్యాన్స్‌లోనూ సంతోషం నెలకొంది.

అది ఆపేసి.. ఇంకోటి పట్టుకున్నాడు
ఇస్మార్ట్ శంకర్ సినిమాకు దర్శకుడు పూరీ జగన్నాథ్ సీక్వెల్ తీయాలని భావించినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల సాధ్యపడలేదనేది సినీ వర్గాల సమాచారం. ఈ క్రమంలోనే నేపథ్యంలోనే తమిళ రీమేక్‌తో ‘రెడ్'కు రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇది తడం సినిమాకు రీమేక్. దీన్ని కిశోర్ తిరుమల తెరకెక్కిస్తున్నాడు. దాంతో క్రేజీ హీరో విజయ్ దేవరకొండతో పూరీ జగన్నాథ్ ‘ఫైటర్' అనే సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.


Click it and Unblock the Notifications











