ఫిల్మ్ ఛాంబర్‌కు వెళ్లిన రాంచరణ్.. బాబాయ్‌కి అబ్బాయ్ సపోర్ట్!

Recommended Video

ఫిలిం ఛాంబర్ లో పవన్ తో మెగా ఫ్యామిలీ తో భేటీ

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొద్దిసేపటి క్రితమే ఫిల్మ్ ఛాంబర్ కు చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ కు మద్దత్తు తెలిపేందుకు మెగా ఫ్యామిలీ, సినీ ప్రముఖులంతా ఏకమవుతున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలిలో దాదాపుగా హీరోలంతా ఫిల్మ్ ఛాంబర్ కు చేరుకున్నట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ అల్లు అర్జున్, రాంచరణ్.. పవన్ కళ్యాణ్ కు అండగా ఉండడానికి ఫిల్మ్ ఛాంబర్ కు చేరుకున్నారు. దీనితో ఫిల్మ్ ఛాంబర్ వద్ద అభిమానుల సందడి కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ తనపై, తన కుటుంబం పై జరుగుతున్న కుట్ర గురించి, దానిని న్యాయపరంగా ఎలా ఎదుర్కొనాలి అనే అంశం గురించి లాయర్లతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

బాబాయ్ కోసం అబ్బాయ్

బాబాయ్ కోసం అబ్బాయ్

ఇటీవలే రాంచరణ్, పవన్ కళ్యాణ్ రంగస్థలం సక్సెస్ మీట్ లో కలసి అభిమానులకు కనువిందు చేసారు. తాజాగా రాంచరణ్ పవన్ కళ్యాణ్ కు మద్దత్తు తెలపడానికి ఫిలిం ఛాంబర్ కు వెళ్ళాడు.

న్యాయపోరాటం

న్యాయపోరాటం

మరి కొద్ది సేపట్లో పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టె అవకాలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ మరోవైపు ఆయన దీక్షకు కూడా దిగుతారని వార్తలు వస్తున్నాయి. ఫిలిం ఛాంబర్ వద్ద ఏం జరగబోతోందనే ఉత్కంఠ అందరిలో నెలకొని ఉంది.

మీడియాపై విమర్శలు

మీడియాపై విమర్శలు

తన తల్లిని అవమానించేలా శ్రీరెడ్డి తిట్టడం వెనుక కొన్ని మీడియా సంస్థల హస్తం, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేష్ హస్తం ఉందని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ మొత్తం వ్యవహారంలో వారికి వ్యతిరేకంగా న్యాయపోరాటం చేయడం ఎలా అని పవన్ కళ్యాణ్ న్యాయవాదులతో మంతనాలు జరుపుతున్నారు.

ప్రముఖ దర్శకులు, నిర్మాతలు

ప్రముఖ దర్శకులు, నిర్మాతలు

పవన్ కళ్యాణ్ మద్దతుగా సినీప్రముఖులంతా ఫిల్మ్ చాంబర్ కు చేరుకుంటున్నారు. మెగా ఫ్యామిలీలోని మెగా బ్రదర్ నాగబాబు, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ ఇప్పటికే ఫిల్మ్ ఛాంబర్ కు చేరుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X