కాస్టింగ్ కౌచ్‌పై మరో నటి సంచలన వ్యాఖ్యలు.. తరిమి కొట్టాలి!
కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు యావత్ చిత్ర పరిశ్రమ మొత్తం కాస్టింగ్ కౌచ్ వలన పలువురు వర్తమాన నటులు ఇబ్బందులు పడుతున్నారనే వాదన తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే. టాలీవడ్ లో శ్రీరెడ్డి దీనిపై సంచలన వ్యాఖ్యలు చేసిన తరువాత అంతటా చర్చనీయాంశంగా మారింది. తాజగా మరో హీరోయిన్ కాస్టింగ్ కౌచ్ పై వ్యాఖ్యలు చేసింది.
చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉన్న సంగతి వాస్తవమే అని నటి రమ్య నంబీశన్ వ్యాఖ్యానించింది. కానీ అలాంటి అనుభవం తనకు ఎదురుకాలేదని వెల్లడించింది. తన సహ నటుల ద్వారా ఈ విషయం గురించి తెలుసుకున్నానని రమ్య తెలిపింది. అవకాశాల పేరుతొ అమ్మాయిలని పడక గదికి రమ్మని పిలిచే సంస్కృతి ఇంకా కొనసాగుతోందని తెలిపింది.

అలాంటి వారిని తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని రమ్య అభిప్రాయ పడింది. ఈ తరహా దుర్మార్గాలు కేవలం సినీపరిశ్రమలోనే కాదని అన్ని రంగాల్లో ఉన్నాయని రమ్య అభిప్రాయ పడింది. కాస్టింగ్ కౌచ్ భాదిత మహిళలు దైర్యంగా ముందుకు వచ్చి పోరాటం చేయాలని పిలుపునిచ్చింది.


Click it and Unblock the Notifications











