»   » ఎక్స్‌ట్రాలు చేస్తున్నారు: రేణు దేశాయ్ వ్యాఖ్యలు ఎవరిపై?

ఎక్స్‌ట్రాలు చేస్తున్నారు: రేణు దేశాయ్ వ్యాఖ్యలు ఎవరిపై?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియా ఫాల్ట్ ఫాం ట్విట్టర్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆమె వ్యాఖ్యలు బట్టి తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఆమెను తమ సిల్లీ ప్రవర్తనతో ఇబ్బంది పెడుతున్నట్లు అవగతం అవుతోంది. కొందరు అభిమానులు... ఆమెను మళ్లీ పవన్ వద్దకు వెళ్లాలని, కనీసం పిల్లల కోసం అయినా ఆ పని చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. దీనిపై రేణు దేశాయ్ వారికి ఘాటుగానే రిప్లై ఇస్తోంది.

చిరు, పవన్‌ కళ్యాణ్‌ లపై మాకు పేటెంట్ హక్కు ఉంది..అందుకే

ఆర్తి అగర్వాల్ మీద చాలా ప్రెజర్ ఉంది: నిర్మాత సురేష్ బాబు
ఈ మధ్య కాలంలో రేణు దేశాయ్ మరో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇద్దరు పిల్లల తల్లి అయిన రేణు దేశాయ్ మరొకరితో డేటింగ్ చేస్తున్నట్లు కూడా షికార్లు పుకార్లు చేసాయి. ఈ వార్తలపై సీరియస్ గా రియాక్ట్ అయిన ఆమె తనదైన రీతిలో సమాధానం ఇచ్చారు.

 Renu Desai Responds On Her Marriage Reports

‘కొందరు నా పెళ్లి ప్రస్తావన తెస్తూ ఎక్స్ ట్రాలు చేస్తున్నారు. అలాంటి వారందరూ గుర్తు పెట్టుకోండి. నేను మళ్లీ పెళ్లి చేసుకోబోవడం లేదు. అలాంటి ఉద్దేశ్యం కూడా లేదు. ఎవరినీ ప్రేమించడం లేదు. నాపై ఇలాంటి గాసిప్స్ సృష్టించ వద్దు' అని రేణు ట్విట్టర్ ద్వారా స్పష్టం చేసింది.

అంతకు ముందు ఆమె...‘పిల్లలు ఉన్నప్పటికీ మగాళ్లు మళ్లీ పెళ్లి చేసుకోవడం వల్ల సమస్య ఏమీ ఉండదు. కానీ మహిళ పరిస్థితి అలా కాదు. పిల్లలు ఉన్నపుడు ఆమె మరో పెళ్లి చేసుకోవడం చాలా పెద్ద సమస్యలకు కారణం అవుతుంది. బేసిగ్గా....తల్లిగా ఉండాలంటే, ఆమె హ్యూమన్ గా ఎమోషన్స్‌ కలిగి ఉండటం మానేయాలి' అంటూ ట్వీట్ చేసారు. ‘నేను ఇకపై ఎప్పటికీ మళ్లీ ప్రేమలో పడను...ఈ విషయం నన్ను ఎప్పుడు అడిగినా ప్రేమలో పడను, పడను అనే చెబుతాను' అంటూ రేణు దేశాయ్ ట్వీట్ చేసారు.

English summary
Only a few days back, Renu Desai was in news for reacting straight to the some silly Pawan Kalyan fans, who tried to bully her. She gave it back for some fans, who repeatedly taunted her to go back to Pawan Kalyan atleast for their kids. Post that, Renu Desai is making headlines again with the reports going viral that she is going to get married soon. The mother of two is allegedly dating someone, according to the reports from some section of media.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu