»   » ఆర్తి అగర్వాల్ మీద చాలా ప్రెజర్ ఉంది: నిర్మాత సురేష్ బాబు

ఆర్తి అగర్వాల్ మీద చాలా ప్రెజర్ ఉంది: నిర్మాత సురేష్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘నువ్వు నాకు నచ్చావ్' చిత్రం ద్వారా హీరోయిన్ ఆర్తి అగర్వాల్‌ను తెలుగు తెరకు పరిచయం చేసిన నిర్మాత సురేష్ బాబు. ఇటీవల ఆర్తి అగర్వాల్ అనారోగ్యంతో మరణించిన నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ఆర్తి అగర్వాల్ గురించి తనకు తెలిసిన విషయాలు బయట పెట్టారు సురేష్ బాబు.

నువ్వు నాకు నచ్చావ్ సినిమా కోసం ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ కోసం వెతుకుతుండగా.... అప్పటికి ఇంకా రిలీజ్ కాని హిందీ సినిమాలో నటించిన నటి ఫోటోలు నా వద్దకు వచ్చాయి. ఆమె ఆర్తి అగర్వాల్. ఆ ఫోటో చూసిన తర్వాత ఆమెనే హీరోయిన్ గా తీసుకోవాలని డిసైడ్ అయినట్లు సురేష్ బాబు తెలిపారు.

ఆమెకు సంబంధించిన రషెస్ చూపెట్టాలని హిందీ సినిమా ప్రొడ్యూసర్ ను అడిగాను. కానీ అతని వద్ద అవి లేవు. దీంతో యూఎస్‌ఏలో ఉంటున్న మా కజిన్ ను వీడియో క్యామ్ తో ఆర్తి అగర్వాల్ ఇంటికి పంపాను. అతడు వీడియో తీసి విజువల్స్ పంపాడు. నేను ఊహించిన దానికంటే పర్ ఫెక్ట్ లుక్ ఉంది. ఇంటి దగ్గర ఉండి సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న ఆమెకు ఇదో పెద్ద అవకాశం.

Suresh Babu about Aarthi Agarwal

షూటింగ్ మొదలు కావడానికి నెల రోజుల ముందు ఆమెను హైదరాబాద్ పిలిపించాం. నువ్వు నాకు నచ్చావ్ సినిమా చాలా పెద్ద హిట్టయింది. తర్వాత చాలా సినిమాల్లో ఆమెనే తీసుకున్నాం. అవి కూడా చాలా పెద్ద హిట్ అయ్యాయి. అయితే రాను రాను ఆర్తి అగర్వాల్ ఆమెపై కంట్రోల్ కోల్పోయింది. చాలా బరువు పెరిగింది. తగ్గించుకోవడానికి వీలులేనంతగా. ఈ సినిమా పరిశ్రమలో నిలబడాలంటే మంచి షేప్ కావాలి. ఆర్తికి టాలెంట్ ఉంది. అయితే ప్రస్తుత పోటీ వాతావరణంలో టాలెంటుతో పాటు అందం కూడా కావాలి.

ఆమె పేరెంట్స్ కూడా సహాయ పడలేదు. సక్సెస్ కోసం ఆమె ఫాదర్ ఆమెపై చాలా ఒత్తిడి తెచ్చేవాడు. ఆమె తనకంటూ ఓ పర్సనల్ లైఫ్ కావాలనుకుంది. అయితే అతను అందుకు ఒప్పుకునే వాడు కాదు. ఓసారి సెట్లో ఈ విషయంలో ఆయనకు సలహా ఇవ్వడానికి ప్రయత్నించాను. అతను ఆసక్తి చూపలేదు. ఈ విషయం కొంత మందికి మాత్రమే తెలుసు. చేసేది ఏమీ లేక నేను దూరంగా ఉండటం ప్రారంభించాను.

గెలుపు ఉన్న చోట ఓటమి కూడా ఉంటుందన్న విషయంలో ఆర్తి అగర్వాల్, ఆమె ఫాదర్ రియలైజ్ కాలేదు. మనం సినీ పరిశ్రమలో ఉన్నాం. ఇక్కడ జయాపజయాలు సహజం. వాటిని సమన్వయంతో డీల్ చేస్తూ ముందుకు సాగాలి. కానీ వారు విజయం గురించి తప్ప మరేమీ ఆలోచించే వారు కాదు అని సురేష్ బాబు చెప్పుకొచ్చారు.

Read more about: aarthi agarwal, tollywood
English summary
“Her parents too didn’t help as her father put a lot of pressure on her to succeed. And while she wanted a personal life of her own, he just didn’t allow it. I tried talking to him once on sets and wanted to give him some advice, but he was not interested. Very few people listen. So I kept my distance
Please Wait while comments are loading...