నభా నటేష్‌ని ఇలియానాతో పోల్చిన వర్మ.. ఆమె రియాక్షన్ ఎలా ఉందంటే!
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. ఇస్మార్ట్ శంకర్ టీమ్ తో కలిసి రచ్చ రచ్చ చేశాడు. నిన్న హైదరాబాద్ లో ఇస్మార్ట్ శంకర్ సినిమా చూసిన ఆయన బీర్లు పొంగిస్తూ ఛార్మి, నభా నటేష్, నిధి అగర్వాల్ లతో ఫుల్లుగా ఎంజాయ్ చేశాడు. అంతేకాదు చిత్రంలో నటీనటుల అభినయం, పూరి టేకింగ్ స్టైల్ పై వరుస ట్వీట్ చేసి సోషల్ మీడియాలోనూ నానా హంగామా చేశాడు.
ఈ మేరకు నభా నటేష్ తో ఫోటో దిగిన వర్మ.. ఆ పిక్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఆమెపై పొగడ్తల వర్షం కురిపించాడు. ఆమెను ఇలియానాతో పోల్చుతూ ఏకంగా ఇలియానా 2 .0 అనేశాడు వర్మ. ''ఇస్మార్ట్ శంకర్ చూశాను.. నో డౌట్.. నభా నటేష్.. ఇలియానా 2 .0 ని పేర్కొన్నాడు వర్మ''. అంతేకాదు ఇప్పటినుంచి నేను నభా నటేష్ ఫ్యాన్ గా మారిపోయా అని అన్నారు వర్మ. ఆయన చేసిన ఈ ట్వీట్ పై స్పందించిన నభా.. ''థాంక్ యూ సర్, మీ సినిమాలంటే నాకు చాలా ఇష్టం.. మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది'' అని పేర్కొంటూ మురిసిపోయింది.

సరైన విజయం కోసం పరితపిస్తున్న పూరీ జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్.. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో ఆ దాహం తీర్చుకున్నారు. చిత్రంలో రామ్, నిధి అగర్వాల్, నభ నటేష్ అభినయం ఆకట్టుకుంటోంది. పూరీ జగన్నాథ్ టేకింగ్ మాస్ ఆడియన్స్ ని ఉర్రూతలూగిస్తోంది. జూలై 18న రిలీజైన ఇస్మార్ట్ శంకర్ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.


Click it and Unblock the Notifications











