»   » బాలయ్య వరుస ప్లాపులు అంటూనే... పొగడ్తలతో ముంచెత్తిన మెగా హీరో!

బాలయ్య వరుస ప్లాపులు అంటూనే... పొగడ్తలతో ముంచెత్తిన మెగా హీరో!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా, నందమూరి వర్గాలు ప్రత్యర్థుల్లా ఉండే వారు అనే అపోహ ఉండేది. అయితే అలాంటిదేమీ లేదని, తమ మధ్య మంచి స్నేహం ఉందని ఆ అపోహను తొలగించే ప్రయత్నం ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నారు మెగా, నందమూరి స్టార్స్.

ఇటీవల సంక్రాంతి సందర్భంగా మెగా స్టార్ చిరంజీవి 150వ చిత్రం, నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం ఒకేసారి విడుదలైనా.... బాక్సాఫీసు వద్ద ఫ్రెండ్లీగా పోటీ పడ్డారు. ఈ సమయంలో వచ్చిన వార్ వార్తలను అటు బాలయ్య, ఇటు చిరంజీవి కూడా ఖండించారు.

ఇక యంగ్ జనరేషన్ విషయానికొస్తే.... రామ్ చరణ్, జూ ఎన్టీఆర్ ఏదైనా ఫంక్షన్లో కలిస్తే చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడం తెలిసిందే. ఇటీవల జూ ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి సాయి ధరమ్ తేజ్ సినిమాను లాంచ్ చేసాడు కూడా.

తాజాగా సాయి ధరమ్ తేజ్ ఇటీవల ఓ సందర్భంలో బాలయ్య గురించి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసారు.

 వరుస ప్లాపులు ఇచ్చారు అంటూనే

వరుస ప్లాపులు ఇచ్చారు అంటూనే

సాయి ధరమ్ తేజ్ ఇటీవల ఓ సందర్బంలో మాట్లాడుతూ... ఒక నటుడు వంద చిత్రాల్లో నటించారంటే, ఆయనలో ఏదో సంథింగ్ స్పెషల్ ఉంటేనే అది సాధ్యం. కొన్ని సంవత్సరాల క్రితం బాలకృష్ణ గారు వరుస ప్లాపులు ఇచ్చారు. కానీ ఆయన ఏ మాత్రం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోలేదు. ఆయన ఎప్పుడూ ఆయన ది బెస్ట్ ఇవ్వాలనే తపనతో ఉంటారు అని తెలిపారు.

 నాగార్జున, వెంకీ గురించి

నాగార్జున, వెంకీ గురించి

నాగార్జున గురించి మాట్లాడుతూ... నాగార్జునగారి స్టైల్ స్టేట్మెంట్, ఫిట్ నెస్ లెవల్స్, డివోషనల్ సబ్జెక్టుల్లో ఆయన ప్రదర్శించే గొప్ప నటన నాకు ఎంతో ఇష్టమని సాయి ధరమ్ తేజ్ చెప్పుకొచ్చారు. వెంకటేష్ సింప్లిసిటీ, పాజిటివ్ థికింగ్ తనకెంతో ఇష్టమని తేజ్ తెలిపారు.

 చిరంజీవి తర్వాత జూ ఎన్టీఆరే అంటూ ప్రచారం: ఈ పుకార్ల వెనక ఎవరు?

చిరంజీవి తర్వాత జూ ఎన్టీఆరే అంటూ ప్రచారం: ఈ పుకార్ల వెనక ఎవరు?

చిరంజీవి తర్వాత జూ ఎన్టీఆరే అంటూ ప్రచారం మొదలైంది. ఈ ఆధారం లేని ఈ పుకార్ల వెనక ఎవరు? అనేది ఆసక్తి కరంగా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

 చిరంజీవి, పవన్ కళ్యాణ్‌తో మల్టీస్టారర్ నిజమే: వివరాలు ఇదిగో...

చిరంజీవి, పవన్ కళ్యాణ్‌తో మల్టీస్టారర్ నిజమే: వివరాలు ఇదిగో...

మెగా బ్రదర్స్‌ చిరంజీవి, పవన్‌కల్యాణ్‌లతో త్వరలోనే ఓ మల్టీస్టారర్‌ చిత్రం చేయనున్నట్లు నిర్మాత, ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి ఆ మధ్య ఓ వేడుకలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సుబ్బిరామిరెడ్డి సరదాగా ఆ మాటలు అని ఉంటారని, ఇది సాధ్యమయ్యే విషయం కాదని అంతా ఈ విషయాన్ని లైట్ తీసుకున్నారు... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

 వచ్చే నెలలో వివాహం: ఈలోగా హీరోయిన్ మీద దారుణం, ఇండస్ట్రీ మొత్తం అండగా!

వచ్చే నెలలో వివాహం: ఈలోగా హీరోయిన్ మీద దారుణం, ఇండస్ట్రీ మొత్తం అండగా!

మళయాల నటి(మహాత్మ మూవీ హీరోయిన్)‌పై ఇటీవల కేరళలో జరిగిన దారుణం సౌత్ ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్ కు గురి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆమెపై జరిగింది లైంగిక వేధింపుల ఘటన, దుండగులు ఆమెను కార్లో తిప్పుతూ అభ్యంగా వేధింపులకు గురి చేస్తూ అశ్లీలంగా ఫోటోలు, వీడియోలు తీసారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
'If an Actor features in 100 Films, It's something very special. Few years ago, Balakrishna garu delivered back-to-back flops but he never lost his self-confidence. On any day, He strives to give his best and hence he have one of the highly devoted fan bases,' Sai Dharam Tej told.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X